NTV Telugu Site icon

N Tulasi Reddy: ఏపీలో మేనిఫెస్టో వార్ నడుస్తోంది.. కాంగ్రెస్ ముందు ఏదీ సరిపోదు

Tulasi Reddy

Tulasi Reddy

N Tulasi Reddy Comments On AP Manifesto War: ఆంధ్ర రాష్ట్రంలో మేనిఫెస్టో వార్ నడుస్తోందని.. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో ముందు టీడీపీ, వైసీపీల మేనిఫెస్టోలు సరిపోవని ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎన్. తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్నవి నిజమైన కుస్తీ పోటీలు కాదని మండిపడ్డారు. వైసీపీ, బీజేపీ మధ్య లాలూచి పోటీ జరుగుతోందని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా చెప్పేవన్నీ వాస్తవాలేనని.. దేశంలోనే నెంబర్ వన్ అవినీతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆరోపించారు. అయినప్పటికీ.. రాష్ట్రంలో సీబీఐ దాడులు ఎందుకు జరగడం లేదు? కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తుంటే ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. సీబీఐని అవినాష్ రెడ్డి అనుచరులు అడ్డుకుంటుంటే కేంద్రానికి సిగ్గులేదా? అని దుయ్యబట్టారు.

BuzBall Cricket: తగ్గేదే లే.. మేం ఇలానే ఆడుతాం! బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. బాబు, జగన్, పవన్ అని తులసిరెడ్డి అభివర్ణించారు. వైఎస్ షర్మిల తమ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, సాదరంగా ఆహ్వానిస్తామని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో.. విశాఖ ఎంపీ ఘటన స్పష్టం చేస్తుందని అన్నారు. ప్రజల ప్రాణాలకు రాష్ట్రంలో రక్షణ లేదన్నారు. పులివెందులలో సొంత చిన్నాన్నను హత్య చేస్తే దిక్కుమొక్కు లేదని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో అధికార ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి, కోట్ల రూపాయల వసూలు చేశారంటే.. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. జగన్‌మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. రౌడీలు, కిడ్నాపర్లు రాజ్యమేలుతున్నారని.. గన్ కల్చర్, గంజాయి కల్చర్ విపరీతంగా పెరిగిపోయిందని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు.

Hyderabad :నార్సింగ్ లో దారుణం.. యువతి పై కత్తితో దాడి చేసిన ప్రియుడు..