తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. ఈ లేఖలో అనేక అంశాలు ప్రస్తావించారు. ఎవరి ప్రమేయం లేకుండా దళితులు వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానంలో ఆలోచన చేయాలి. కొన్ని పదవులలోనైనా దళితులకు పూర్తి స్వేచ్ఛ ఇప్పించాలి. దళిత నాయకులతో సమావేశం పెట్టి వారి సలహాలు తీసుకుని ముందుకు వెళితే బాగుంటుంది. కొందరు దళితులు ఇతర వర్గాలు నివసించే ప్రాంతాలలో ఉండడం వల్ల లక్షలాది రూపాయలు నిధులు వారి పేరుతో ఖర్చు చేయడం వల్ల ఎక్కువ జనాభా నష్టపోతున్నారు.
Read Also: Heeraben Modi: హీరాబెన్ మోడీ అంత్యక్రియలు పూర్తి.. మాతృమూర్తి పాడె మోసిన ప్రధాని మోడీ
నాలుగు రోజులు వ్యవధి లో సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం రెండు లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 26 న రిజర్వేషన్లు అమలు, ఈ డబ్ల్యూఎస్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై లేఖలో పేర్కొన్నారు. ఈ రోజు దళితుల పదవులు, వారికి స్వేచ్చ ఇవ్వాలని లేఖ రాశారు. ఎవరి ప్రమేయం లేకుండా దళితులు వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానంలో ఆలోచన చేయాలని.. కొన్ని పదవుల లోనైనా దళితులకు పూర్తి స్వేచ్ఛ ఇప్పించాలని కోరారు.
దళిత నాయకులతో సమావేశం పెట్టి వారి సలహాలు తీసుకున్న ముందుకు వెళ్తే బాగుంటుందని లేఖలో అభిప్రాయపడ్డారు… కొందరు దళితుల ఇతర వర్గాలను సొంత ప్రాంతాల్లో ఉండడంవల్ల లక్షలాది రూపాయల నిధులు వారి పేరుతో ఖర్చు చేయడం వల్ల ఎక్కువ జనాభా నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు ముద్రగడ.. నాలుగు రోజులు వ్యవధి లోనే సీఎం కి రెండు లేఖలు రాశారు పద్మనాభం.. ఈనెల 26న కాపు రిజర్వేషన్లు అమలు, ఈ డబ్ల్యు ఎస్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీఎం దృష్టికి తీసుకుని వచ్చారు.
Read Also: President Droupadi Murmu: యాదాద్రీశుడిని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము