సీఎం జ‌గ‌న్ కు ముద్ర‌గ‌డ లేఖ‌

సి.ఎం జగన్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ రాశారు. సంక్రాంతి పండుగ వ‌స్తున్న నేప‌థ్యంలో ఐదు రోజుల పాటు కోడిపందాల పర్మిషన్ కు పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ముద్రగడ లేఖ ద్వారా సీఎం జ‌గ‌న్ ను కోరారు. కోడి పందాలు వంటివి జల్లికట్టు కంటే ప్రమాదకరమైన ఆటలు కావని… గ్రామాల్లో సంక్రాంతికి ఎడ్ల పందాలు, కోడిపందాలు, జాతర్లు ఆచారమ‌ని గుర్తు చేశారు.

https://ntvtelugu.com/tsrtc-20-discount-on-rs-100-t24-tickets-for-visitors-to-hyderabad-book-fair/

ఇటీవల సంక్రాంతికి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అనేక ఇబ్బందులు పెడుతున్నారని మండిప‌డ్డారు. చివరికి పర్మిషన్ ఇచ్చేయటంతో పోలీస్ శాఖ కూడా ఇబ్బంది పడుతోందని… పండుగుల సమయంలో ప్రజలకు పని ఉండదు కాబట్టి ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. పండుగలకు ప్రజలు జైలుకు వెళ్లేలా పరిస్థితి ఉండకూడదని కోరారు ముద్రగడ.