Site icon NTV Telugu

YS Viveka Murder Case: ముగిసిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ.. వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు..

Avinash Reddy

Avinash Reddy

YS Viveka Murder Case: సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది.. వరుసగా మూడోసారి ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించింది.. ఇక, ఇవాళ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన అనినాష్‌రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ కేసులో కీలకమైన విషయాలు పక్కనబెట్టి నన్ను విచారణకు పిలిచారు.. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రమ్మన్నారని తెలిపారు.. సీబీఐ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేసిన అవినాష్‌.. నేను ఏ తప్పూ చేయలేదు.. నాపై ఆరోపణల్లో పెద్ద కుట్ర ఉంది.. కట్టుకథను అడ్డం పెట్టుకొని విచారణ చేస్తున్నారని ఆరోపించారు. మా వైపు నుంచి ఏ తప్పు లేదు, న్యాయపోరాటం చేస్తాను అని ప్రకటించారు.

Read Also: YS Viveka Murder case: అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు

ఒక వ్యక్తి టార్గెట్‌గా సీబీఐ విచారణ జరగడం మంచిది కాదని హితవుపలికారు అవినాష్‌రెడ్డి.. అది గూగుల్‌ టేకౌట్‌ కాదు.. టీడీపీ టేకౌట్‌గా కామెంట్‌ చేసిన ఆయన.. అసలు ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నారు.. ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నన్ను వైసీపీ క్యాడర్‌ ప్రశ్నిస్తోంది.. ఇక నుండి నేను మాట్లాడటం మొదలు పెడతానన్నారు. వివేకా ది మర్డర్ ఫర్ గైన్‌గా వ్యాఖ్యానించారు. ఆయన ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నారు.. ఆమెకు పుట్టిన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు.. వివేకం సార్‌ ఆయన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నారు.. ఈ ఆస్థులన్ని వాళ్ళకి వెళ్లిపోతాయి.. రాజకీయ వారసులుగా వస్తారని.. సునితమ్మ భర్త రాజశేఖర్ కుట్ర చేశాడని నా అనుమానం అంటూ మరో బాంబ్‌ పేల్చారు.

Read Also: CM KCR : అంబేద్కర్‌ విగ్రహాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్‌

హత్య జరిగిన ప్రాంతంలో లెటర్‌ను మాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అవినాష్‌రెడ్డి. గతంలో మీరు వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతిచెందారని తెలిపారుగా అని మీడియా ప్రశ్నించగా.. నేను గుండెపోటు అని ఎప్పుడూ చెప్పలేదు.. ఇదంతా టీడీపీ వాళ్లు చిత్రీకరించారని ఆరోపించారు. వైఎస్‌ వివేకా హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయన్న ఆయన.. నా సోదరి సునితమ్మ హై కోర్టులో.. సుప్రీంకోర్టులో నాపై అనేక ఆరోపణలు చేశారు.. కానీ, ఏ ఒక్క రోజు నేను ఎవరి గురించి మాట్లాడలేదన్నారు.. అసలు వాళ్లు వెళ్లమంటేనే నేను ఘటనా స్థలానికి వెళ్లాను.. వెళ్లమని చెప్పింది వాళ్లే.. ఇప్పుడు నాపై ఆరోపణలా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. నేను కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే.. సీబీఐ అధికారులు సునితమ్మకు సమాచారం ఇచ్చి ఇంప్లీడ్ చేస్తున్నారు.. సీబీఐ లీక్‌లు ఇస్తోందని మండిపడ్డారు ఎంపీ అవినాష్‌రెడ్డి. మరోవైపు.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సోమవారం వరకు అవినాష్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. అరెస్ట్‌ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.

Exit mobile version