MP MVV Satyanarayana Shocking Comments On Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ తనపై చేసిన విమర్శలకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను రాజీనామా చెయ్యమని చెప్పడానికి పవన్ ఎవరు? అని ప్రశ్నించారు. దమ్ముంటే తనపైపై ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. గాజువాకలో తుక్కు తుక్కుగా ఒడిపోయినోడివి నువ్వా నా గురించి మాట్లాడేదని మండిపడ్డారు. ఓడిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా గాజువాక రాని నువ్వా నన్ను ప్రశ్నించేది అని నిలదీశారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను స్వాగతించి, అప్పుడు పవన్ వైజాగ్ గురించి మాట్లాడాలని అన్నారు. మాస్టర్ ప్లాన్స్, అనుమతులు, వ్యవస్థ మీద కనీస అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. అటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తానని చెబుతున్నాడని ఎద్దేవా చేశారు.
UK Visa: యూకే విజిటింగ్‌కు వీసా కావాలా ? హోటల్ కెళ్లి ఎంచక్కా తెచ్చుకోవచ్చు
నువ్వు మగాడివైతే 175 సీట్లలో పోటీ చేయాలని ఎంపీ ఎంవీవీ డిమాండ్ చేశారు. టీడీపీ మోచేతి నీళ్లు ఎందుకు తాగుతున్నావని పవన్‌ని ప్రశ్నించారు. కాపు కులం ఆత్మాభిమానం తాకట్టు పెట్టి, చంద్రబాబు బూట్లు నాకుతూ సిగ్గులేని బ్రతుకు బతుకుతున్నావని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను టాక్సులు కట్టి వ్యాపారం చేసేవాడినని.. నీ ఆవేశం, హీరోయిజం స్పీచ్‌ల్లో కాదు పోటీ చేసి చూపించాలని ఛాలెంజ్ చేశారు. నీది అసలు ఒక మనిషి జన్మేనా అని ప్రశ్నించారు. కాజా దగ్గర 50 కోట్లు విలువైన భూమిని తక్కువకు కొంటే అది నీతి.. మేము కష్టపడి వ్యాపారాలు చేస్తే అది అవినీతా అని అడిగారు. పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబును ప్రకటించమని చెప్పమని డిమాండ్ చేశారు. అప్పుడు తామంతా కలిసి మద్దతు ఇస్తామన్నారు. 2024లో గెలిస్తే ఎన్నిరోజులు ఎవరు పరిపాలిస్తారో విషయం తేల్చాలని కోరారు.
Viral Video: ప్రియురాలి కోసం వెళ్లి బుక్కైన ప్రియుడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో!
నీ కంటే KA పాల్ 100 శాతం బెటరని ఎంపీ ఎంవీవీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీకు సినిమాలు లేకపోతే అడుక్కుతినడానికి కూడా పనికి రావన్నారు. వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడలంటే.. నీకంటే చెత్త వ్యక్తి మరొకరు ఉండరని విమర్శించారు. బ్రో సినిమా డిస్ట్రిబ్యూటర్‌లు నష్టపోతే.. ఒక్క రూపాయి అయినా తిరిగిచ్చావా? అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఒక స్టేట్ రౌడీ అని, వీధి రౌడీకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని అన్నారు. పవన్ కళ్యాణ్ అనేది వ్యక్తి కాదని, అన్ని విధాలుగా పతనమైన శరీరమని సెటైర్లు వేశారు. కుక్కో, నక్కో మోరిగినట్టు మొరుగుతున్నందుకే తాము స్పందిస్తున్నామని చెప్పారు.