NTV Telugu Site icon

Margani Bharath: ఒడిశా రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి

Margani Bharath

Margani Bharath

MP Margani Bharath Demands Investigation On Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతికత కాలంలో.. సిగ్నల్ వ్యవస్థ దెబ్బతిని, ఘోరమైన రైలు ప్రమాదం జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం.. ఈ రైలు ప్రమాదంపై రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను పరిశీలించి, ప్రమాదంలో చిక్కుకున్న రాజమండ్రి ప్రయాణికుల గురించి ఆరా తీశారు. రైల్వే అధికారులతో ప్రమాదంపై సమీక్షించారు. రాజమండ్రికి చెందిన 26 మంది ప్రయాణికుల్లో 12 మంది సెల్‌ఫోన్లు రెస్పాన్స్ కావడం లేదు. ఇప్పటికే ఈ ప్రమాదంపై సీఎం జగన్ స్పందించి.. ప్రత్యేకంగా అంబులెన్స్‌లు పంపారని, మోనటరింగ్, సహాయక చర్యల కోసం ప్రత్యేక అధికారులను నియమించారు.

David Warner: ఇది హాస్యాస్పాదం.. ఆస్ట్రేలియా బోర్డుపై వార్నర్ ఫైర్

ఇదిలావుండగా.. శుక్రవారం సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొనడానికి కారణం, రైలు ట్రాఫిక్‌ను ట్రాక్ చేసే భారతీయ రైల్వే వ్యవస్థ తప్పిదమేనని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనలో 288 మందికిపైగా మృతి చెందరగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. రైలు నంబర్ 12841 కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు అప్‌మెయిన్ లైన్ కోసం సిగ్నల్ ఇవ్వగా.. అది లూప్ లైన్‌లోకి ప్రవేశించింది. అప్పటికే ఆ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలుని డీకొని, పట్టాలు తప్పడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. కోరమండల్ రైలులో 19 బోగీలు పట్టాలు తప్పాయి. సంఘటనా స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించి, సహాయక చర్యలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు.. ఈ రైలులో మొత్తం 178 మంది తెలుగువారు ప్రయాణించారని తెలిసింది. వారిలో మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారాల్ని అధికారులు సేకరిస్తున్నారు.

Khiladi Lady: కి‘లేడీ’.. అధిక వడ్డీ ఆశ చూపి రూ.41 లక్షలు స్వాహా