Site icon NTV Telugu

MP Margani Bharat: నేను 10 సినిమాల్లో హీరోగా చేయగలను.. నువ్వు కమెడియన్‌గా కూడా పనికిరావు..!

Mp Margani Bharat

Mp Margani Bharat

MP Margani Bharat: ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయినా, తాము అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.. కానీ, అధికార, విపక్షాల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీయే తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్.. ప్రత్యేక హోదా లేదని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు నిద్రపోతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై అశోక్ గజపతిరాజు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై చేసిన వ్యాఖ్యాలను ఖండించారు.

Read Also: Nandamuri Balakrishna: అభిమానులు లేనిదే నాలాంటి కళాకారులు లేరు..

మరోవైపు.. ఏపీలో అధిక ధరలు అంటూ నారా లోకేష్‌ చేస్తున్న విమర్శలపై స్పందించిన ఎంపీ భరత్.. దేశవ్యాప్తంగా ఉన్న అధిక ధరలే ఆంధ్రప్రదేశ్ లోనూ ఉన్నాయన్నారు.. ఉత్తర కుమారుడిలా లోకేష్ మాట్లాడుతున్నాడు.. లోకేష్ లేకపోతే ఏపీ రాజకీయాల్లో కామెడీ ఉండదంటూ ఎద్దేవా చేశారు. నన్ను ఏకచిత్ర హీరో అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అంటున్నాడు.. నేను అనుకుంటే సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అనుమతి తీసుకుని పది సినిమాల్లో హీరోగా చేయగలను.. కానీ, రఘురామ కృష్ణంరాజు కామెడీ యాక్టర్ గా కూడా పనికిరాడు అంటూ కౌంటర్‌ ఇచ్చారు. దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు విశాఖకు తరలిరావడం శుభపరిణామం అన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్.

Exit mobile version