Nandamuri Balakrishna: అభిమానులు లేనిదే నాలాంటి కళాకారులు లేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: అభిమానులు లేనిదే నాలాంటి కళాకారులు లేరన్నారు నటసింహ, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. విజయవాడలో వేగా జ్యూవెలరీ షోరూంను ప్రజ్ఞా జైస్వాల్, వేగా జ్యూవెలరీ సంస్థల ప్రతినిధులు నవీన్ కుమార్, సుధాకర్‌లతో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేగా జ్యువెలర్స్ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.. చాలామంది బంగారు షాపు ప్రారంభోత్సవానికి వస్తున్నానంటే రకరకాలుగా మాట్లాడుకున్నారు.. ఆయన నాకేమీ పర్వాలేదు.. తెలుగువారిని ముందుండి నడిపించడంలో నేనెప్పుడూ ముందుంటానని చెప్పుకొచ్చారు.. ఇక, మా ఇంటి పేరుతో ఉన్న నందమూరి రోడ్ లో ఈ షోరూంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు బాలయ్య.
Read Also: Khushboo Sunder: నా తండ్రి నీచుడు.. అందుకే సిగ్గులేకుండా చెప్పా
Also Read
మహిళలకు ఎంతో ఇష్టమైనవి ఆభరణాలు… కమ్మలు, గాజులు, బంగారుపు నగలను భర్తలతో చెప్పి కొనిచ్చుకోండి అంటూ మహిళలకు సూచించిన బాలయ్య.. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు.. మన తెలుగింటి ఆడపడుచులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న వారందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు అన్నారు.. ఇక, తాజాగా విడుదలైన తన చిత్రం వీర సింహారెడ్డి చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించారాన్ని ఆనందం వ్యక్తం చేశారు.. మరోవైపు అన్ స్టాపబుల్ టాక్ షో ని అంతా కలిసి విజయవంతం చేశారని కృతజ్ఞతలు తెలిపారు.. అభిమానులు లేనిదే నాలాంటి కళాకారులు లేరన్న బాలయ్య.. మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రంగాలలో సాధికారత సాధించిన మహిళలందరికీ ఇవే నా శుభాకాంక్షలు అన్నారు. ఇక, బాలయ్య, హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ విజయవాడ రావడంతో.. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.. దీంతో.. నందమూరి రోడ్ సందడిగా మారింది.
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!