కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు బీజేపీ ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. కేంద్ర హోం శాఖ సబ్ కమిటీ సమావేశ ఎజెండా నుంచి ప్రత్యేక హోదా వంటి అంశాల తొలగింపు పై స్టేట్ మెంట్ విడుదల చేయాలని కోరారు జీవీఎల్. ఎజెండాలో పెట్టాల్సిన అంశాలను అధ్యయనం చేయటానికి మరో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
ప్రత్యేక హోదా అంశాన్ని మొదట ప్రస్తావించింది మేమే అన్నారు జీవీఎల్. అప్పుడు టీడీపీ, వైసీపీ నేతలు నిద్ర పోతూ ఉన్నారు. మా ఒత్తిడి వల్లే ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశం వచ్చింది. సంబంధం లేని నాలుగు అంశాలు పొరపాటుగా ఎజెండాలో చేర్చారు. ఏపీ రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశాలను మనమే మాట్లాడుకోవాలన్నారు జీవీఎల్.
కమిటీలో వేరే రాష్ట్ర అధికారులు ఉన్నా చర్చ జరగాలి అనటం అవివేకం కాదా?? నేను అడిగిన తర్వాతే కమిటీ ఎజెండా అంశాలను సమీక్షించి మార్పులు చేసింది కేంద్ర హోంశాఖ. రాష్ట్రానికి దీర్ఘకాలికంగా నష్టం జరుగుతుందని చొరవ తీసుకున్నాను. నా ప్రయత్నంతో హోదా అంశం మరింత సంక్లిష్టం కాకుండా చేయగలిగానన్నారు. రాష్ట్ర ప్రజలు ధన్యవాదాలు చెప్పాలన్నారు జీవీఎల్.
ఏపీకి ప్రత్యేక హోదా పై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఎంపీ జీవీఎల్. ప్రత్యేక హోదా ఇప్పుడు లేదు. దీన్ని అందరూ అర్ధం చేసుకోవాలి. ఏపీ రెవెన్యూ గ్యాప్, స్పెషల్ స్టేటస్ వంటి అంశాలు వివాద పరిష్కార కమిటీలో ఉంచే అంశం పై బుగ్గన స్పందించాలి. బుగ్గన ఉండాలని చెబితే నా లేఖను మార్చుకుంటా. జూనియర్ స్థాయి అధికారులు పొరపాటు చేశారు. దాన్ని రాజకీయం చేస్తే ఎలా?? అన్నారు జీవీఎల్.