NTV Telugu Site icon

MP Avinash Reddy: సీబీఐ నోటీసులపై ఘాటుగా స్పందించిన ఎంపీ అవినాష్‌రెడ్డి.. నిన్న ఇచ్చి ఇవాళ రమ్మంటే ఎలా..?

Mp Avinash Reddy

Mp Avinash Reddy

MP Avinash Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది.. అయితే, సీబీఐ నోటీసులపై ఘాటుగా స్పందించారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. నిన్న మధ్యాహ్నం నోటీసులు ఇచ్చి ఇవాళ మధ్యాహ్నం విచారణకు రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు.. ఇక, ఐదు రోజులపాటు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం పులివెందుల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని వెల్లడించారు.. చక్రాయపేట మండలం గండి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించిన అవినాష్ రెడ్డి.. అక్కడే శాశ్వత అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీబీఐ నోటీసులపై మీడియా ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ.. వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు పూర్తిగా సహకరిస్తారని వెల్లడించారు.

Read Also: NTR: ఈరోజు సాయంత్రం ఏం జరిగినా మేము చూసిన బెస్ట్ యాక్టర్ మాత్రం నువ్వే…

అయితే, ఐదు రోజులపాటు సమయం కావాలని సీబీఐకి లేఖ రాశారని తెలిపారు ఎంపీ అవినాష్‌రెడ్డి… మరోసారి సీబీఐ అధికారులు తనకు నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నందున ఆ నోటీసు తీసుకున్న తర్వాత విచారణకు హాజరవుతారని చెప్పారు. ఇదే సందర్భంలోనే రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసు విషయంలో తన పై, తన కుటుంబం పై ఓ వర్గం అసత్య ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చే శారు అవినాష్ రెడ్డి.. తనపై వచ్చిన అభియోగాలపై తాను చాలా బాధపడ్డాను అన్నారు. ఇలాంటి విషయాల పైన ఓ నిర్ణయానికి రావడం ఎవరికైనా మంచిది కాదని హితవు పలికారు. ఈ కేసులో న్యాయం గెలవాలి.. నిజం నిర్భయంగా బయటికి రావాలని కోరుకుంటున్నాను తెలిపారు. నేనేంటో.. నా వ్యవహరి శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలకు అందరికీ తెలుసని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసు విషయంలో మీడియా సమయనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.