తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్… శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అచ్చెన్నాయుడు అభద్రతా భావంతో కొట్టుమిట్టాడితున్నారని ఎద్దేవా చేశారు.. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో నీవు ఏ పార్టీకి ఓటేస్తావు.. ఏ పార్టీ తరఫున నామినేషన్ వేస్తావు..? అంటూ అచ్చెన్నాయుడుని ప్రశ్నించారు.. పార్టీలేదు, బొక్కాలేదు అన్న పార్టీకే నామినేషన్ వేస్తావా..? నీకు సిగ్గుందా..! అంటూ ఫైర్ అయిన ఆయన.. 18 నెలలు ముందే నా టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యింది… నీ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యిందా? అచ్చెన్నాయుడు అంటూ సెటైర్లు వేశారు.. అసలు నీకు దమ్ముందా.. నువ్వు పోటీ చేస్తావా.. ? నువ్వు నామినేషన్ వేయగలవా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే..
Read Also: Rahul Gandhi: బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలాడుతూ.. ప్రజల్ని మభ్యపెడుతున్నాయి