NTV Telugu Site icon

Vallabhaneni Vamsi: సీఎం జగన్‌ సమీక్షకు డుమ్మా..! వల్లభనేని వంశీ స్పందన ఇదే..

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం వేదికగా మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజనల్‌ కో-ఆర్డినేటర్లు, నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. మరోసారి మనం అధికారంలోకి రాకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని.. అంతా కలిసికట్టుగా పనిచేస్తే.. అను లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు.. ఇక, ఏ ఒక్క ఎమ్మెల్యేను గానీ, ఏ ఒక్క కార్యకర్తను గానీ నేను వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు.. అయితే, ఈ సమావేశానికి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.. అందులో ఒకరు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. దీనిపై ఎన్టీవీ ఆయనను సంప్రదించింది.. నిన్న జరిగిన సీఎం సమీక్షకు గైర్హజరుపై స్పందించిన ఎమ్మెల్యే వంశీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కోర్సు చేస్తున్న.. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో హాజరుకాలేదన్నారు.

Read Also: Prabhas: అన్నపూర్ణ స్టూడియోలో టెర్రస్ ఎక్కిన పాన్ ఇండియా స్టార్

ఇక, నేను, కొడాలి నాని పార్టీ మారుతున్నాం అంటూ ప్రచారాలు వచ్చాయి.. అవి మెరుపు కలలు మాత్రమే.. అటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు వల్లభనేని వంశీ.. ఎన్నికలు పరోక్ష, ప్రత్యక్ష ఎన్నికలు ఉంటాయి.. పరోక్ష ఎన్నికల్లో ఎప్పుడూ వైసీపీ పోటీ పడలేదు.. అందుకనే టీడీపీకి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్లు గెలుచుకుందన్నారు. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎన్నికల్లో 19 ఓట్లు ఉన్నాయి.. అయినా టీడీపీ అభ్యర్థులు గెలిచారు అంటే ఆర్థిక అంశాలే అని విమర్శించారు. ఆ ప్రలోభాల్లో తెలంగాణలో జరిగిన ఘటన పునరావృతం కాకపోవడం చంద్రబాబు నాయుడు అదృష్టంగా పేర్కొన్నారు. టీడీపీ నాయకుల నుండి డబ్బులు ఖర్చు పెట్టించేందుకే ముందస్తు ఎన్నికలు అంటూ గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: IPL 2023: కేకేఆర్ కు షాకిచ్చిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తప్పుకున్నా.. షకీబ్‌ తో పాటు మరో బ్యాటర్..!

మరోవైపు మాతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు టచ్‌లో ఉన్నారంటూ గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు.. ఇది మైండ్ గేమ్‌ మాత్రమే అంటూ మండిపడ్డారు వంశీ… అంతిమంగా ఓట్లు వేసి గెలిపించేది ఓటర్లు మాత్రమే అన్నారు. చంద్రబాబు నాయుడుని చూసి ఓట్లు వేయని వారు.. నారా లోకేష్ సుందర మోకారవిందాని చూసి ఓట్లు వేస్తారా ? అంటూ ఎద్దేవా చేశారు వల్లభనేని వంశీ. కాగా, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన ఆయన.. ఆ తర్వాత టీడీపీనికి రాజీనామా చేసిన విషయం విదితమే..

Show comments