హైదరాబాద్‌లో ఘనంగా బోనాలు జరుగుతున్నాయి.. ఓల్డ్ సిటీ లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు గుంటూరు జిల్లా తాటికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి… వైపీసీ ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికింది లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ… ఇక, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వమించిన ఎమ్మెల్యే శ్రీదేవి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తాను డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశానని గుర్తుచేసుకున్నారు.. నేను వైసీపీ ఎమ్మెల్యేను, అధికార ప్రతినిధిని.. అంటే జగనన్న ప్రభుత్వం తరపున ఇక్కడికి వచ్చానన్న ఆమె.. రెండు రాష్ట్రాల పండుగ.. అందరం కలిసి ఉండాలని ఆకాక్షించారు. భవిష్యత్‌లో నేను మంత్రిని అయితే మొదట ఇక్కడికే వచ్చి అమ్మవారికి మొక్కలు తీర్చుకుంటున్నానని తెలిపారు ఎమ్మెల్యే శ్రీదేవి.
లాల్‌దర్వాజ బోనాలు.. అమ్మవారికి ఏపీ ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు

Undavalli Sridevi