ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు చిచ్చు పెడుతున్నాయి.. తాజాగా, జరిగిన పరిణామాలపై ఆవేదనకు గురైన ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అవసరం అయితే రాజీనామాకైనా సిద్ధమంటున్నారు.. ఇంతకీ ఆమె అసంతృప్తి కారణం ఏంటంటే.. శ్రీశైలం బోర్డు చైర్మన్ నియామకమే. తాజాగా, శ్రీశైలం బోర్డు చైర్మన్‌గా చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని నియమించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయితే, ఈ వ్యవహారం రోజాకు మింగుడుపడడం లేదు.. చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై రోజా కినుకు వహించారు.. కాగా, స్థానిక ఎన్నికల్లో రోజా, చక్రపాణిరెడ్డి మధ్య వివాదం చోటు చేసుకుంది.. తాజాగా, ఆయనకు పదవి రావడంపై ఆవేదనకు గురైన రోజా.. ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తా అంటున్నారు.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారి తీస్తుందనేది వేచిచూడాలి.. టీకప్పులో తుఫాన్‌లా మారిపోతుందా.. రాజీనామా వరకు వెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: కేసీఆర్‌పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..