Site icon NTV Telugu

MLA Balakrishna: ఆర్టీసీ బస్సును నడిపిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

Balayya

Balayya

MLA Balakrishna: హిందూపురం ఆర్టీసీ బస్టాండ్ లో నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి సవిత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఇక, బస్సులోకి ఎక్కిన తర్వాత బాలకృష్ణ ఓ చిన్న పిల్లాడితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా స్వయంగా ఆర్టీసీ బస్సును బాలకృష్ణ నడిపారు. హిందుపురం ఎమ్మెల్యే బస్సు నడిపిస్తుంటే.. వెనకాల నుంచి జై బాలయ్య జైజై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.

Read Also: Kolkata Doctor case: మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ప్రశ్నించిన సీబీఐ

కాగా, అంతకుముందు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్న క్యాంటీన్లను రెండు చోట్ల ప్రారంభించారు. స్వయంగా పేదలకు భోజనాన్ని వడ్డించారు. ఇక, పేదలకు మూడు పూటలా కడుపునిండా భోజనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వంద క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో మరిన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తాం.. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. అలాగే, హిందూపురం అభివృద్ధికి సీఎం రూ.90 కోట్లు మంజూరు చేయనున్నారు.. దీంతో పాటు జిల్లాకు సత్యసాయి పేరు అలాగే ఉంచి.. జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించారు.

Exit mobile version