Site icon NTV Telugu

Mekapati Chandrasekhar Reddy: నెల్లూరు వైసీపీలో మరో కలకలం.. ఇంకో ఎమ్మెల్యే అసంతృప్తి.. చిచ్చు పెడుతున్నారు..!

Mekapati Chandrasekhar Redd

Mekapati Chandrasekhar Redd

Mekapati Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లాలో మరో వైసీపీ ఎమ్మెల్యే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైసీపీ పరిశీలకుడుగా నియమించిన కొడవలూరు ధనుంజయ రెడ్డి నియోజకవర్గంలో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు ఉదయగిరి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి.. ఎమ్మెల్యే కి ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించాల్సిన ధనంజయ రెడ్డి.. పార్టీలో తన ను వ్యతిరేకిస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ధనుంజయ రెడ్డి వ్యవహార శైలిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పారు. వైఎస్ కుటుంబానికి వీర విదేయుడైన తనను దెబ్బతీసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనమీద పెత్తనం చేస్తే సహించబోనని ఈ విషయాన్ని మరోసారి ముఖ్యమంత్రి తేల్చుకుంటానని శేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. శేఖర్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. కాగా, నెల్లూరు జిల్లాలో ఈ మధ్య అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి.. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారం దుమారం రేపుతోన్న సమయం.. ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వ్యవహారం కాకరేపుతోంది.

Read Also: Tammineni Veerabhadram: కేంద్ర బడ్జెట్.. తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఉంది

Exit mobile version