NTV Telugu Site icon

Karanam Dharmasri: రాజీనామా లేఖ ఇచ్చిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. మీకు దమ్ముందా..?

Karanam Dharmasri

Karanam Dharmasri

ఓవైపు అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతుల పాదయాత్ర చేస్తుంటే.. వారు ఉత్తరాంధ్రలోకి అడుగు పెడుతున్న సమయంలో.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. కొత్త ప్లాన్‌ చేస్తుంది.. ఇప్పటికే నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఏర్పాటు అయ్యింది.. ఈ నెల 15వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించానల నిర్ణయించారు.. రైతుల తమ ప్రాంతంలో వచ్చే సరికి వైజాగ్‌ రాజధానిగా ఉండాలంటూ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు.. ఇదే సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ… విశాఖను రాజధానిగా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే పదవికి కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసిన ఆయన.. ఆ లేఖను జేఏసీ ప్రతినిధులకు అందజేశారు. ఇక, దమ్ముంటే అచ్చెన్నాయుడు కూడా రాజీనామా చేయాలని సవాల్‌ చేశారు..

Read Also: Minister Gudivada Amarnath: రాజధానిపై రెఫరెండం అంటే టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేయాలి..

విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే.. ముమ్మాటికి అమరావతికి మేం వ్యతిరేకమే అన్నారు ధర్మశ్రీ.. దమ్ముంటే రాజీనామాకు అచ్చన్నాయుడు సిద్ధ పడాలని సవాల్‌ చేసిన ఆయన.. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాకు నేను సిద్ధం అంటూ.. జేఏసీ కన్వీనర్‌కు తన రాజీనామా లేఖను అందజేశారు.. ఎగ్జిక్యూటివ్ కెపిటల్ కు అనుకూలంగా నేను చోడవరంలో.. వ్యతిరేకిస్తూ టెక్కలిలో అచ్చన్నాయుడు పోటీకి సిద్ధం అవ్వాలన్న ఆయన.. కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకించే నాయకులను రాజకీయాల నుంచి వెలివేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వారం రోజుల పాటు నియోజకవర్గ కేంద్రాల్లో విస్త్రతంగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తాం.. ఈనెల 15న భారీ నిరసన ప్రదర్శన చేపడతామని తెలిపారు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ..