NTV Telugu Site icon

MLA Anil Kumar: 2024 ఎన్నికల్లో చంద్రబాబుని ప్రజలు సెంటు భూమిలో కప్పెడతారు

Anil Kumar On Cbn

Anil Kumar On Cbn

MLA Anil Kumar Fires On Chandrababu Naidu: వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సెంటు భూమి సమాధి కట్టుకోవడానికి పనికొస్తుందని చెప్పిన చంద్రబాబును.. 2024 ఎన్నికల్లో ప్రజలు ఆ సెంటు భూమిలోనే కప్పెడతారని ధ్వజమెత్తారు. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు అహంకారపూరిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పాల కేంద్రం వద్ద వైయస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభించిన అనిల్ కుమార్.. ఈ సందర్భంగానే చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అహంకార ధోరణిని ప్రతి ఒక్కరు అసహ్యించుకుంటున్నారని అన్నారు. పేదలంటే చంద్రబాబుకు చిన్న చూపు, చులకన భావమని.. పేదలకు ఇల్లు ఇస్తుంటే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు. పేదల కోసం ఆలోచించిన ఘనత నాడు వైయస్సార్, నేడు జగన్‌కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడానికి జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు.

Allu Arjun: తన మొదటి గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన బన్నీ.. స్నేహ ఏమంటుందో..?

అంతకుముందు.. రాజకీయాల్లో ఉన్నంతకాలం తాను జగన్ వెంటే ఉంటానని, జగన్ కోసమే పని చేస్తానని అనిల్ కుమార్ అన్నారు. జగనన్న తనను తరిమేసినా, తిట్టినా, పార్టీలో ఉండొద్దని చెప్పినా.. తాను జగన్ వెంటే ఉంటానే తప్ప పార్టీ మారి, వేరే గుమ్మం తొక్కే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైయస్ జగన్ తనకు ఓ వ్యసనమని, ఆయన కోసం ఏమైనా చేస్తానని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా.. అది జగన్ పెట్టిన భిక్షేనని అన్నారు. తనకు ఏదైనా బాధ కలిగితే.. కచ్చితంగా ఆ విషయం గురించి జగన్‌కి చెప్పుకుంటానని పేర్కొన్నారు. ఒకవేళ తనని పోటీ నుంచి తప్పుకోమని జగన్ చెప్తే.. వెంటనే తప్పుకుంటానన్నారు.

Kriti Kharbanda : శృతి మించిన కృతి.. ఆందాల ఆరబోత కాదు పారబోతే