Palabhishekam to CM YS Jagan’s Photo: సీఎం జగన్ ఫొటోకి మంత్రుల పాలాభిషేకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palabhishekam to CM YS Jagan’s Photo: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు బీసీ మంత్రులు.. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్ , మెరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరావు , మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. వైఎస్ స్ఫూర్తితో వైసీపీ అధికారంల్లోకి వచింది.. సీఎం జగన్ బీసీల ఆశయ సాధకుడని తెలిపారు.. 18 స్థానాలకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సింహ భాగం అంటే.. 11 స్థానాలు బీసీలకి, 3 స్థానాలు ఎస్సీ, ఎస్టీలకి ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.. ఈ సందర్భంగా పాలాభిషేకం చేసి సీఎం జగన్ ని స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు.. గత ప్రభుత్వం మాటల్లో మాత్రమే బీసీలను న్యాయం చేస్తే.. సీఎం జగన్ చేతల్లో న్యాయం చేశారంటూ ప్రశంసలు కురిపించారు.
Read Also: Kangana Ranaut: బాలీవుడ్ మాఫియా.. వారికి అవార్డులు ఏంటీ..?
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
విద్య, వైద్యంలో ప్రజలు అభివృద్ధి చెందుతారని నమ్మే వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు మంత్రి బొత్స.. అయన క్యాబినెట్ లో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ డిక్లరేషన్ చేసిన నాయకుడు జగన్ అంటూ గుర్తుచేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇక, సామజిక అసమానతను దూరం చేసిన నాయకుడు సీఎం జగన్… చంద్రబాబు దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా? అంటూ అవమాన పరిచాడు.. కానీ, సీఎం జగన్.. గ్రామ స్థాయి నుండి అనేక పదవుల్లో మెజారిటీ పదవులు అణగారిన వారికి ఇచ్చారు. రాజకీయ ప్రాధాన్యత కలిగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి మేరుగ నాగార్జున..
Read Also: IPhone : హౌరా.. పాత ఐఫోన్‌కు 57 లక్షలా..? ఎందుకంత డిమాండ్..
మరోవైపు.. దేశ చరిత్రలో సీఎం జగన్ చిర స్థాయిలో నిలిచిపోతారు అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి జోగి రమేష్.. కనీసం వార్డు పదవుల్లో కూడా లేని మా కులం వారికి ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభలో అనేక పదవులు ఇచ్చారు.. ప్రజలు అందరూ.. అణగారిన వర్గాలు జగన్ కి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పార్టీని బంగాళాఖాతాంలో కలపాలని వ్యాఖ్యానించారు మంత్రి జోగి రమేష్. ఇక, గతంలో చంద్రబాబు పదవులని అమ్ముకున్నాడు అని ఆరోపించారు మంత్రి కారుమూరి నాగేశ్వరావు.. చెప్పిన మాట నెలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 85 వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేశాడన్న ఆయన.. బీసీలు అందరం జగన్ వెంటే ఉంటామని ప్రకటించారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంక్ గా చూశారు.. కానీ, సీఎం జగన్ వారికి బ్యాక్ బోన్‌గా ఉన్నారని పేర్రకొన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
తాజావార్తలు
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!