Ministers Fires on Pawan Kalyan: యువశక్తి సభలో పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేయడంపై రాష్ట్ర మంత్రులు కౌంటర్ ఎటాక్ చేశారు.. ఇక, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స్పందింస్తూ ఘాటు వ్యాఖ్యలు చే శారు.. సభలో పవన్ కల్యాణ్ అనేక అబద్ధాలు చెప్పినప్పటికీ, ఒకటి మాత్రం నిజం చెప్పాడని అన్నారు. మరోసారి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి వీరమరణం పొందలేనని చెప్పాడని, అందులో వాస్తవం ఉందని ఎద్దేవా చేశారు. గతంలో జగన్ చేతిలో ఒకసారి బడితెపూజ జరిగింది, ఈసారి కుక్కచావు చావడం ఎందుకని పవన్ నిజం చెప్పాడన్నారు. తానెందుకు చంద్రబాబు సంకలో దూరాల్సి వస్తుందో చెప్పడానికే పవన్ ఈ సభ ఏర్పాటు చేశాడు. యువతకు ఉద్యోగాలు, యువతకు ఉపాధి అంతా వట్టిదే. జగన్ మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అంటే పవన్ బాగా ఊగిపోతున్నాడు. ఉత్తరాంధ్రలో సత్యానంద్ వద్ద పవన్ నేర్చుకున్న విద్యే కదా ఇది. ఊగడం, ఆగడం ఆయనకు అలవాటే. చంద్రబాబుతో నీకు ఉన్నది అత్తా అల్లుడి సంబంధమో, మామా అల్లుడి సంబంధమో, దత్తతండ్రి, దత్తపుత్రుడి సంబంధమో… నీ నోటితో నువ్వే చెబుతున్నావు, మళ్లీ ఉలిక్కిపడుతున్నావు. చంద్రబాబు ఎదురింట్లో ఉన్న అత్త లాంటోడు, మామ లాంటోడు అని చెబుతున్నావు కదా, జగన్ మోహన్ రెడ్డి ఏం చెబుతున్నారంటే… అత్తా మామ కాదయ్యా దత్తతండ్రి అని చెబుతున్నారు. వరసే కదా తేడా!” అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.
Read Also: Kottu Satyanarayana: పవన్‌దే మూడు ముక్కలాట.. సింగిల్‌గా వెళ్లే దమ్ములేదు..
పవన్ కల్యాణ్‌కు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రెండుసార్లు గెలిచిన నేను.. రెండు చోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా అని మండిపడ్డారు. అయినా ప్రజల కోసం తప్పట్లేదంటూ ట్వీట్ చేశారు.. మరోవైపు, మంత్రి గుడివాడ అమర్నాథ్ పవన్‌పై విమర్శలు గుప్పించారు. తనకు తెలిసింది పోరాటమే.. ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణమే అన్నారు. క్యా బాత్ హై అని పవన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. పవన్‌కు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.. నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్‌వి అంటూ సెటైర్లు వేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సభలో పవన్ తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికే సరిపోయిందని మండిపడ్డారు. ఏరా, ఒరే అనడమేనా సంస్కారం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు స్వభావం గల వ్యక్తి పవన్. పవన్.. ఇదేనా నీ వ్యక్తిత్వం? అంటూ ప్రశ్నించారు. మంత్రి రోజాను డైమాండ్ రాణి అంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. రోజా సినిమాల్లో నటించిందని..దిగజారి మాట్లాడని.. ఆయన ఇంట్లో ఆడవాళ్లు.. సినిమాల్లో నటించడం లేదా అని ప్రశ్నించారు. సభకువచ్చిన జనాన్ని పవన్ కల్యాణ్ నమ్మను అని చెప్పడం దౌర్భాగ్యమన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తనకు నమ్మకం ఇవ్వగలరా అని జనాన్నే ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మూడు ముక్కల రాజకీయ నాయకుడన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఓ వైపు బీజేపీతో పొత్తులో ఉండి మరోవైపు టీడీపీతో రాజకీయం చేస్తున్నారన్నారు. దేశంలో పవన్ ఒక్కడే బరితెగింపు రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం వేదికగా పవన్ కల్యాణ్… చంద్రబాబు సంక ఎక్కబోతున్నానంటూ తేల్చేశాడన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇక పవన్ ముసుగు తొలగించారన్నారు. బీజేపీతో సంసారం చేస్తూ.. పవన్ టీడీపీకి కన్నుకొడుతున్నాడని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. దీన్ని రాజకీయ వ్యభిచారం అనరా అంటూ ప్రశ్నించారు. రోజుకో మాట.. పూటకో పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని కామెంట్ చేశారు.
