NTV Telugu Site icon

Vidadala Rajini: ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు

Vidadala Rajini

Vidadala Rajini

Vidadala Rajini: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి విడదల రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి మూడు రాజధానుల అవసరాన్ని సీఎం జగన్ ఇప్పటికే చెప్పారని.. అయినా చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని విడదల రజినీ వ్యాఖ్యానించారు. తమకు రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు త్వరలో మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తే చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు.

Read Also: Three Wheels Electric Car: మూడు చక్రాలతో ఎలక్ట్రిక్ కారు.. ధర రూ.4 లక్షలే..!!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలోని ఐదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతాయని మంత్రి విడదల రజినీ అన్నారు. ఈ ఐదు మెడికల్ కాలేజీల ద్వారా 750 సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు. మెడికల్ కాలేజ్ తీసుకురావాలన్న ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదని విడదల రజినీ ఎద్దేవా చేశారు. తమకు అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం మెడికల్ కాలేజీలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. తల్లి లాంటి భారతిపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని.. తాము కూడా అదే స్థాయిలో సమాధానం చెప్తామని మంత్రి విడదల రజినీ హెచ్చరించారు.