Minister Venu Gopala Krishna Released Dhavaleswaram Barrage Water: గత ప్రభుత్వం వ్యవసాయం దండగ అని మాట్లాడిందని.. కానీ సీఎం జగన్ మాత్రం పంట వేసే రైతుకి భరోసా ఇస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చెప్పారు. ధవళేశ్వరం వద్ద గోదావరి బ్యారేజ్ నుంచి ఖరీఫ్ సీజన్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని దైవంగా భావించి, ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతన్నల కోసం ఈ నీటిని విడుదల చేశామని అన్నారు. మూడు డెల్టాల ద్వారా నీటిని విడుదల చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఖరీఫ్‌కు గోదావరి జలాల విడుదలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. జిల్లాల విభజన జరిగిన తర్వాత ప్రజారాజ్యం కోసం మెడికల్ కాలేజీ విషయంలో 150 సీట్లు జీవో విడుదల అయ్యిందన్నారు. ఒక కోటి 20 లక్షలు ఇన్‌పుట్ సబ్సిడీ కేటాయించుంది ఒక్క వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు. పి.గన్నవరంలో బ్రిడ్జి కడుతున్నారని, పలు చోట్ల పనులు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే నీటి విడుదల విషయంలో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేస్తామన్నారు. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని నవెల్లడించారు.
Telangana : పెద్దపల్లిలో ఘోరం.. ఆటో బైక్ ఢీ.. లారీ కింద పడి వ్యక్తి మృతి..
ఇదే సమయంలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఈరోజు రైతు భరోసాతో పాటు ధవళేశ్వరం బ్యారేజ్ నుండి రైతులకు నీటిని విడుదల చేశామని చెప్పారు. 8 వేల క్యూసెక్కుల నీటిని మూడు డెల్టాలకు అందిస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మెడికల్ కాలేజీకి 150 సీట్లు కేటాయించడంపై సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలిపారు. నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్ రైతుల పక్షాన అండగా నిలిచారన్నారు. కాగా.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రాష్ట్ర మంత్రులు వేణుగోపాలకృష్ట, తానేటి వనితలతో పాటు ఎంపీ మార్గాని భరత్, కలెక్టరు మాధవీలత, ఇరిగేషన్ సీఈ ఆర్.సతీష్ కుమార్, డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ఇతర ప్రజాప్రతినిధులు గోదావరి జలాలను తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేశారు.
Karnataka: వీడేం డాక్టర్ సామి.. ఆపరేషన్ థియేటర్లోనే తప్ప తాగిపడిపోయాడు