NTV Telugu Site icon

Maoist Letter: ఏపీ మంత్రికి మరోసారి మావోయిస్టుల వార్నింగ్.. నాకు సంబంధం లేదు..!

Seediri Appalaraju

Seediri Appalaraju

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సీదిరి అప్పలరాజుకు మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు మావోయిస్టులు.. పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.. పార్టీ పంపిన లేఖపై చర్యలుంటాయనడం అప్పలరాజుకి తగదని.. మంత్రి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని ఆంధ్ర ఒడిశా బోర్డర్ (ఏవోబీ) కమిటీ వైవీఎస్ కార్యదర్శి అశోక్ పేరుతో లేఖ విడుదలైంది.. ఇక, ఈ లేఖ సోషల్‌ మీడియాలో ఎక్కి వైరల్‌గా మారిపోయింది.. అయితే, గతంలో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ గణేష్ పేరిట లేఖ విడుదల కాగా.. ఇప్పుడు వైవీఎస్‌ కార్యదర్శి అశోక్ పేరిట లేఖ వచ్చింది. ప‌ద్దతి మార్చుకోకుంటే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయని హెచ్చరించి మావోయిస్టులు.. పేద‌ల భూముల‌ను క‌బ్జా చేసే అనుచ‌రుల‌ను అదుపులో ఉంచుకోవాలంటూ ఆయ‌న‌ను వార్నింగ్‌ ఇచ్చారు.. మావోయిస్టులపై తప్పుడు ప్రచారం మంచిది కాదని లేఖలో హితవుపలికారు..

Read Also: Home Minister Taneti Vanitha: అది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల పాదయాత్ర.. ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తున్నారు..!

అయితే, మావోయిస్టుల లేఖపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి సీదిరి అప్పలరాజు.. మావోయిస్టుల నుంచి నాకు లేఖ రావడం ఆశ్చర్యం కలిగించే విషయం అన్నారు.. మావోయిస్టుల లేఖలోని అంశాలతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు ఈ లేఖ నిజమా? లేదా? అనే విషయాన్ని తేల్చాల్సింది పోలీసులే అన్నారు. లేఖలో ప్రస్తావించిన అంశాల విషయానికి వస్తే.. రామకృష్ణాపురం భూములకు సంబంధించి.. సూదికొండలోని గ్రావెల్‌ క్వారి గురించి అసలు నాకేంటి? సంబంధం అని ప్రశ్నించారు. సూదికొండ అనేది పాలస నడిబొడ్డున ఉండే కొండ.. గతంలోనే గ్రావెల్‌ క్వారీకి అనుమతి తీసుకొచ్చి.. పార్టీకి చెందిన నేతే క్వారీ ప్రారంభించారు.. కానీ, అది మంచిది కాదని, ప్రజల నుంచి వ్యతిరేక వస్తుందని.. నేనే క్వారింగ్‌ ఆపించి.. కౌన్సిల్‌లో తీర్మానం చేయించామన్నారు.. అయితే, సూది కొండ క్వారింగ్‌ ఆపినందుకు తమ పార్టీలోని నేతే.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఒక అసమ్మతి నేత నాపై దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి అప్పలరాజు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి…

Show comments