Site icon NTV Telugu

Minister Satya Kumar: విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప జగన్ ఇంకేం చేస్తాడు‌..

Satya Kumar

Satya Kumar

Minister Satya Kumar: రైతుల తరపున పోరాటం చేస్తే తప్పులేదు‌ అని మంత్రి సత్యకూమార్ అన్నారు. కానీ, విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప జగన్ చేస్తాడు‌.. వైసీపీ నేతలు సిగ్గు లేకుండా 10 వేల మందితో అనుమతి కోరుతారా..‌ రైతులను పరామర్శించడానికి 10 వేల మంది ఎందుకు.. ఏం చేయాలని అనుకుంటున్నారు 10 వేల మందితో.. దండయాత్ర చేయడానికి వెలుతున్నారా అని ప్రశ్నించారు. మీ 11 ఎమ్మెల్యేలు, మీ ఎంపిలతో వెళ్ళండి.. పరామర్శ పేరుతో వెళ్ళి రైతుల పంటను తొక్కి నాశనం చేసి, వారిపై రాళ్ళ దాడులు చేస్తారు, కార్యకర్తలను కారుతో తొక్కి చంపేస్తారు‌ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

Read Also: Congress: ఏపీ మంత్రి నారా లోకేష్‌ను రహస్యంగా కలిసిన కేటీఆర్.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

ఇక, ఆడిగితే మా కార్యకర్తలు చంపితే మీకెంటి నోప్పి అంటారు.. ఐదేళ్ళుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. తోతాపూరి అంటే ఎంటో అసలు జగన్ కు తెలుసా.. ఏ రోజు అయినా ఒక్క రూపాయి ఇచ్చాడా.. ఏం తెలుసు అని యాత్రలకు వస్తారు‌‌‌‌‌‌.. ఐదేళ్ళు జగన్ చేసినా మోసాలు అన్ని నమ్మారు.. ఇక నమ్మే పరిస్థితి లేదు‌.. వైసీపీ నేతలకు మైండ్ దెబ్బతింది.. వారి మానసిక పరిస్థితి బాగాలేదు‌‌‌‌ అని మండిపడ్డారు. వారి కోసం వైజాగ్ లో ఒక మెంటల్ హాస్పిటల్ పూర్తి చేశాం‌.. వారికి ప్రత్యేక చికిత్స అందిస్తాం‌ను అన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో మెడికల్ సీట్లు పెరుతాయని సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

Exit mobile version