Site icon NTV Telugu

Minister Satyakumar: కేతిరెడ్డిపై మద్యం బాంబు.! ప్రైవేటు పరం కాదంటూ కౌంటర్.!

Minister Satyakumar Yadav

Minister Satyakumar Yadav

Minister Satyakumar: అనంతపురం జిల్లాలో మంత్రి సత్యకుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పట్ల అనేక కుంభకోణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో కేతిరెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని, అది తమకు ముందే తెలిసిన విషయమేనని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల సతీసమేతంగా ధర్మవరంలో ఒకటిన్నర రోజు గడిపారని గుర్తు చేసిన సత్యకుమార్, “ఆ రోజుల్లో ఏ లెక్కలు మాట్లాడుకున్నారో ప్రజల ముందుకు తేలాలి” అని అన్నారు. రాయలసీమకు మద్యం డబ్బులు ఎవరి ప్రాంతం ద్వారా వెళ్లలేదని, దానిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

WhatsApp: ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటో చోరీ.. దొంగను పట్టించిన వాట్సాప్ గ్రూప్..

వైద్య కళాశాలలు, ఆసుపత్రుల విషయంలో ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. “వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం లేదు. పీపీపీ మోడల్లో నిర్మాణం చేపడుతున్నాం. కానీ యాజమాన్య హక్కులు మాత్రం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటాయి” అని స్పష్టం చేశారు. అలాగే, దీనిపై విమర్శలు చేసే వారు కూడా స్వయంగా టెండర్లలో పాల్గొనాలని సవాలు విసిరారు. వైసీపీకి ప్రజల ఆరోగ్యం పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే, గతంలో మీరే ఈ నిర్మాణాలను ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు.

ఆరోగ్యశ్రీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సత్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం కోటి 23 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. తురుకపాలెంలో చోటుచేసుకున్న ప్రత్యేక పరిస్థితులపై ఇప్పటికే హైలెవల్ ఎంక్వైరీ వేయబడిందని చెప్పారు. వైసీపీ నేత జగన్‌పై నేరుగా దాడి చేసిన మంత్రి సత్యకుమార్, “జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి. అప్పుడు అన్ని విషయాలపై చర్చ జరపడానికి సిద్ధంగా ఉన్నాం” అని సవాలు విసిరారు.

Puri & Sethupathi : ప్రత్యేక ఎంట్రీ సీక్వెన్స్ కోసం పూరి స్పెషల్ ప్రిపరేషన్

Exit mobile version