NTV Telugu Site icon

Sathya Kumar: తొందరలోనే రాష్ట్రంలో అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తాం..

Satya Kumar

Satya Kumar

Sathya Kumar: ఆరోగ్య శ్రీ అమలుపై ఏపీ వైద్య మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ ఎక్కడికి పోదు… యధావిధిగా నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు గత 5 ఏళ్లలో 13 సార్లు నోటీసులు ఇచ్చారు.. ఎన్డీయే అధికారంలోకి వచ్చి 50 రోజుల్లో.. అప్పుడే దుష్ప్రచారం చేస్తున్నారు.. 5 సంవత్సరాల నుంచి అన్ని శాఖలను జగన్ నిర్వీర్యం చేశారు.. ఎయిమ్స్ హాస్పిటల్ కేవలం 16 నెలల్లో పూర్తి అయింది.. జగన్ సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకే మౌలిక సదుపాయాలు చేయలేకపోయారు.. వైద్య విద్యలో, ఆరోగ్య శాఖలో విధ్వంసం చేశారు.. త్వరలోనే రాష్ట్రంలో అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

Read Also: Toofan: చివరి నిముషంలో వెనక్కి తగ్గిన విజయ్ ఆంటోనీ.. రిలీజ్ ఎప్పుడంటే?

ఇక, అంతకుముందు.. జీవన్ దాన్ పై అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు. ఇదే వేదికపై అవయవదానానికి అంగీకరిస్తూ మంత్రి సత్య కుమార్ యాదవ్ సంతకం పెట్టారు. అలాగే, అవయవదానం చేసిన వారి కుటుంబ సభ్యులను మంత్రి, ఎమ్మెల్యే సత్కరించారు. ఏపీలో 260 మంది అవయవ దానం‌ కోసం ముందుకు వచ్చారు.. తెలంగాణలో 800 మంది ముందుకు వచ్చారు.. 90 వేల మంది అవయవ దానం కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.