NTV Telugu Site icon

Minister Roja: జగన్ అంటే ఒక బ్రాండ్.. జగన్ అంటే జోష్

Minister Roja On Jagan

Minister Roja On Jagan

Minister Roja Praises CM YS Jagan Over Global Investors Summit: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఊహించని స్థాయిలో పెట్టుబడులు రావడం చాలా ఆనందంగా ఉందని మంత్రి రోజా పేర్కొన్నారు. పర్యాటక రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎమ్ఓయూలు జరిగాయని తెలిపారు. పర్యాటక రంగంలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి అని సంతోషం వ్యక్తం చేశారు. వంద శాతం ప్రతిపాదనలన్నీ గ్రౌండ్ అవుతాయని చెప్పారు. జగన్ అంటే ఒక బ్రాండ్ అని, జగన్ అంటే ఓ జోష్ అని రోజా కొనియాడారు. ముఖ్యమంత్రిపై ఉన్న నమ్మకంతోనే.. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని మంత్రి వెల్లడించారు.

China: అమ్మాయిలను వద్దు అన్నారని.. ఆ ప్రకటనల్లోనూ అబ్బాయిలే!

అంతకుముందు.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రోజా అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా నామమాత్ర ఒప్పందాలు కాదని, అన్ని ఒప్పందాలను క్షేత్రస్థాయిలో పెట్టుబడుల వరకు తీసుకువెళ్తామని అన్నారు. కొవిడ్‌ కారణంగా పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామని.. విశాఖలో సమ్మిట్‌ తర్వాత అన్ని దేశాలు ఆంధ్రప్రదేశ్‌‌వైపు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓబురాయి హోటల్స్‌ యాజమాన్యం తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, విశాఖలో సరికొత్త హోటల్స్‌ ఏర్పాటు చేయనున్నాయని తెలిపారు. తిరుపతి టెంపుల్‌ టూరిజంగా, విశాఖపట్నం ప్రకృతి టూరిజంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పుకొచ్చారు.

Husband Kidnap: దారుణం.. RIP అంటూ భర్త ప్రచారం.. శిరోముండనం చేసిన భార్య ప్రియుడు

అలాగే.. ట్విటర్ మాధ్యమంగా ఏపీ రాజధానిపై కూడా రోజా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీ వాడు వెక్కిరించినా.. మద్రాస్ వాడు వెళ్లగొట్టినా.. హైదరాబాద్ వాడు గెంటేసినా.. మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం. పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మా వైజాగ్‌ను తీర్చిదిద్దుతాం – నిజమైన ఆంధ్రోడు’’ అంటూ ట్వీట్ చేశారు. అసలైన ఆంధ్రావాళ్లు ఎవరైనా.. రాష్ట్ర పురోగతిని కాంక్షించే వాళ్లు ఎవరైనా సరే.. విశాఖను రాజధానిగా అంగీకరిస్తా్రనే అర్థం వచ్చే రోజా ఆ ట్వీట్ చేశారు.

Show comments