Site icon NTV Telugu

Minister Roja: కుప్పంలో చంద్రబాబు దొంగఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచాడు

Minister Roja

Minister Roja

Minister Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో జరిగిన గత ఎన్నికల్లో చంద్రబాబు దొంగ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచాడని ఆరోపించారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన దొంగ ఓట్లతో ఇన్నాళ్ళూ గెలిచాడని.. ఇప్పుడు ఆ ఓట్లు పోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం ప్రజలు తరిమికొట్టారని మంత్రి రోజా విమర్శలు చేశారు. దొంగ ఓట్లతోనే చిత్తూరు ఎంపీ సీటు గెలుస్తున్నాడని అన్నారు. నారా లోకేష్‌ది యువగళం కాదని.. తెలుగుదేశం పార్టీకి మంగళం పాడే కాలమని ఎద్దేవా చేశారు. లోకేష్ వార్డు మెంబర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు చాలా చాలా తక్కువ అని చురకలు అంటించారు.

Read Also: VijayaSaiReddy: టీడీపీ పాలనలో ఒక కులంలో, ఒక జిల్లాలోనే అభివృద్ధి

తండ్రి సీఎం, తాను మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అంటే లోకేష్ కంటే వెస్ట్ లీడర్ ఎవరు లేడని మంత్రి రోజా అన్నారు. లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో ఎవరికీ తెలియడం లేదని రోజా కౌంటర్లు వేశారు. పవన్ కళ్యాణ్‌ది యువ శక్తి కాదు ముసలి శక్తి అని ఆరోపించారు. గతంలో చిరంజీవి పార్టీ పెట్టి అ కులం వాళ్లందరినీ రోడ్డుమీద వదిలేశారని.. మళ్ళీ ఇప్పుడు ఆయన తమ్ముడు మరో పార్టీ పెట్టి మరోలా డ్రామా ఆడుతున్నారని విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ వెనుక ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 2014లో కూడా పవన్ టీడీపీ వ్యతిరేక ఓటు చీల్చడానికి పోటీ చేశాడేమోనని ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడు.. ఉత్త పుత్రుడు 14 ఏళ్లుగా చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు. జాబ్ క్యాండర్ ప్రకటించి వేలాది, లక్షలాది ఉద్యోగుల ఇచ్చిన ఘనత జగన్‌ది అని స్పష్టం చేశారు. మహిళా క్రీడాకారులను ఎవరు ఇబ్బంది పెట్టినా.. వేధించినా కఠినంగా శిక్షించాలని మంత్రి రోజా పేర్కొన్నారు.

Exit mobile version