RK Roja: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి విజయం తర్వాత పోస్టుమార్టం నిర్వహించిన అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విప్‌ను ధిక్కరించి టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారంటూ.. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది.. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు ఉండవల్ల శ్రీదేవిపై వేటు వేసింది.. అయితే, వేటు పడిన ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. బహిష్కృత ఎమ్మెల్యేలకు దమ్ము ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు.. ఒక్క ఎమ్మెల్సీ స్థానం గెలిచి ఏదో సాధించామని సంబర పడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు మంత్రి రోజా..
Read Also: Sree Venkateswara Cinemas: ధనుష్, శేఖర్ కమ్ముల మూవీ ఉన్నట్టా? లేనట్టా!?
ఇక, ఎమ్మేల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు నీచ రాజకీయాలు అర్థం అవుతున్నాయన్నారు మంత్రి రోజా.. మరోవైపు.. ఉండవల్లి శ్రీదేవిని కోవిడ్ సమయంలో స్పెషల్ ఫ్లైట్ పెట్టి సీఎం జగన్ ప్రాణాలు కాపాడితే.. ఈరోజు ఆయన నుండే ప్రాణహాని ఉందని చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. హైదరాబాద్ లో ఉండే డాక్టర్ ని తీసుకువచ్చి అమరావతిలో గెలిపిస్తే ఈరోజు పార్టీకి ద్రోహం చేసిందంటూ ఫైర్ అయ్యారు. ఎంత పెద్ద డాక్టర్ అయినా.. ఎంత సీనియర్ లీడర్ అయినా.. సరే.. గత ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ వల్లే గెలుపొందారు.. వారికి దమ్ము ఉంటే.. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆ నలుగురు ఎమ్మేల్యేలు రాజీనామా చేసి మీకు నచ్చిన పార్టీ నుంచి పోటీ చేస్తే.. ఎవరి బలం ఏంటో తేలిపోతుంది అంటూ చాలెంజ్ చేశారు మంత్రి ఆర్కే రోజా. కాగా, నన్ను కూడా తెలుగుదేశం పార్టీ నేతలను ప్రలోభాలకు గురుచేశారని.. తనకు పది కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిదంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం విదితమే.