NTV Telugu Site icon

Minister Roja: పవన్ కళ్యాణ్‌కు చిన్న మెదడు చితికింది.. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు

Minister Roja

Minister Roja

Minister RK Roja Fires On Pawan Kalyan Over AP Volunteer Issue: ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కు చిన్న మెదడు చితికిపోయిందని, అందుకే వాలంటీర్లపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. వాలంటీర్లేమో రోబోలు గానీ, బయటి వ్యక్తులు గానీ కాదని.. మీ ప్రాంతానికి చెందిన మీలో ఒకరికే వాలంటీర్ బాధ్యతలు అప్పగించామని తెలిపారు.

Thota Trimurthulu: రామచంద్రపురంలో సీటు ఎవరికి ఇవ్వాలో హైకమాండ్‌దే నిర్ణయం

వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడుతున్నారని, ప్రేమించుకొని పారిపోతున్నారని, భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. వాలంటీర్లను కేవలం ఇదొక్కటే చేయమని తామేమీ ఒత్తిడి చేయడం లేదని.. వాలంటీర్ పనులు చేస్తూనే చదువుకోవచ్చని, ఇతర ఉద్యోగాలకు అప్లై చేయొచ్చని మంత్రి రోజా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన పిచ్చి వ్యాఖ్యల్ని నమ్మకుండా.. ఇలాంటివన్నీ గమనించాలని అన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రజలకు అన్నీ అందుతుండటం చూసి సహించలేకే.. ప్రతిపక్షాలు ఇలా ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు. ఒకవేళ వాలంటీర్లకు పైస్థాయి ఉద్యోగాలు వస్తే, అందుకు ప్రభుత్వం అండగా కూడా ఉంటుందని హామీ ఇచ్చారు.

Taneti Vanitha: అత్యాచారానికి గురై మృతిచెందిన మైనర్ బాలిక కుటుంబానికి 10 లక్షల ఆర్థికసాయం

ఇక చంద్రబాబుకి వయసు పెరిగేకొద్దీ చాదస్తం ఎక్కువైందని.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనేమీ చేయలేదని రోజా ధ్వజమెత్తారు. అప్పట్లో రాష్ట్రాన్ని విడగొట్టారని, ఏపీ సీఎంగా అయ్యాక అభివృద్ధివైపుకు రాష్ట్రాన్ని నడిపించలేదని, కనీసం ప్రజలకు ఒక్క పథకం కూడా ఇవ్వలేదని తూర్పారపట్టారు. జన్మభూమి కమిటీల ద్వారా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అటు మామను, ఇటు ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని.. ఇకపై ఏపీ ప్రజలు ఆయన్ను నమ్మరని పేర్కొన్నారు. పాదయాత్ర సమయంలో తాను ఇచ్చిన హామీల్ని సీఎం అయ్యాక నెరవేరుస్తున్న గొప్ప వ్యక్తి జగనన్న అని కొనియాడారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏమీ చేయలేని చంద్రబాబు.. ఈసారి ఛాన్స్ ఇస్తే చేస్తామంటే, ఎంతవరకు నమ్మాలో మీరు ఆలోచించుకోండని ప్రజల్ని సూచించారు.