NTV Telugu Site icon

Minister RK Roja: రాజధాని కూడా లేకుండా చేసిన పార్టీలో చేరేవారికి ప్రజలే బుద్దిచెబుతారు..

Rk Roja

Rk Roja

Minister RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాగా వేసేందుకు బీఆర్ఎస్‌ ప్రయత్నాలు మొదలు పెట్టింది.. అయితే, ఏపీలోని అధికార, విపక్ష నేతలు.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు స్థానం లేదంటున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి ఆర్కే రోజా.. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీని (బీఆర్ఎస్‌) ప్రజలు ఆదరించబోరన్నారు.. విభజన చట్టంలో హమీలను నేరవేర్చని పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

Read Also: Rajamahendravaram: సీఎం జగన్‌ సభలో అపశృతి

ఇక, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కూడా లేకుండా చేసిన పార్టీలో చేరేవారికి ప్రజలు బుద్ది చెబుతారని వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి రోజా.. మరోవైపు, చంద్రబాబు పబ్లిసిటి పిచ్చితో ప్రజలను చంపి.. ప్రభుత్వంపై ఆరోపణలు చెయ్యడానికి సిగ్గుండాలి అంటూ మండిపడ్డారు మంత్రి రోజా.. లోకేష్ అబద్దపు ట్వీట్లతో ప్రజలను మోసగిస్తూన్నారని విమర్శించారు.. ఇప్పటంలో అక్రమణదారులకు మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ .. ఇప్పడు ఎక్కడా? అని నిలదీశారు.. చంద్రబాబు సభల్లో ప్రజలు ప్రాణాలు విడుస్తుంటే.. పవన్‌ కల్యాణ్‌ కనీసం ప్రశ్నించరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, చంద్రబాబు సభలకు అనుమతిపై ప్రభుత్వం పునారోలచన చేస్తుంది.. రోడ్లపై కాకుండా గ్రౌండ్లలో సభలకు అనుమతి ఇస్తుందని తెలిపారు మంత్రి ఆర్కే రోజా. కాగా, రాష్ట్ర విభజనకు కారణమైన బీఆర్ఎస్‌కు ఏపీలో స్థానం లేదని.. ప్రజలు ఆ పార్టీ వైపు చూడరని నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే.