Minister Ramprasad Reddy: ఎన్టీవీతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి రాసలీలల ఆరోపణలు చేస్తూ వైసీపీ రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంపై దాడి చేయడానికి సమస్యలు ఏవీ దొరకక, ప్రతి రోజూ వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. పాలనాపరమైన సమస్యలు ఉంటే వాటిపై మాట్లాడాలి.. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని మంత్రి మండిపల్లి సూచించారు.
Read Also: Nikki Haley: రష్యా చమురు దిగుమతులపై జాగ్రత్తగా ఉండండి.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు!
వారికి శిక్ష తప్పదు..
ఇక, భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పుడూ తిరుమలలోనే రాజకీయాలు చేస్తుంటారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన హయాంలో లడ్డూలో కల్తీ నెయ్యి స్కామ్ జరిగిందని అందరికీ తెలిసిందే.. కరుణాకర్ రెడ్డి చేసిన అక్రమాలు ఒకటి రెండు కాదు, త్వరలో అన్ని బయటకు వస్తాయని స్పష్టం చేశారు. అలాగే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అన్ని అక్రమాలపై జరుగుతున్న విచారణ చివరి దశకు చేరుకుంది.. అవినీతికి పాల్పడిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. సరైన సమయంలో పెద్దిరెడ్డితో పాటు ఇతర నేతలపై కూడా చర్యలు తీసుకుంటామని రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Shilpa Shetty : ఈ అలవాట్ల వల్లే.. యాభైల్లోనూ ఇంత ఫిట్‌గా ఉన్న..
టీడీపీ క్రమశిక్షణా కమిటీ చర్యలు..
అయితే, టీడీపీ పార్టీ అనేది కోటి ఇరవై లక్షల మంది కార్యకర్తలతో ఉన్నదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గుర్తు చేశారు. ఎవరో ఒకరు పార్టీ లైన్ దాటి మాట్లాడినంత మాత్రాన పెద్ద సమస్యేమీ కాదన్నారు. పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణా తగిన కమిటీ చర్యలు తీసుకుంటుంది.. వారిని పిలిచి వివరణ తీసుకుంటుందన్నారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం క్రమంగా అమలు చేస్తోంది.. దీంతో వైసీపీ నాయకులకు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.. అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
