PeddiReddy: వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీదే గెలుపు.. ఇది పక్కా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister PeddiReddy Ramachandra Reddy: ఈనెల 22న కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం నాడు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. 33 ఏళ్లుగా చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉండి కనీసం మున్సిపాలిటీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కుప్పంను మున్సిపాలిటీగా, రెవెన్యూ డివిజన్‌గా మార్చి అభివృద్ధి చేస్తున్న ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీదే విజయమని మంత్రి పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు.
Read Also:RRR: బిగ్ బ్రేకింగ్.. ఆస్కార్ రేసులో ‘ఆర్ఆర్ఆర్’ కు నో ఎంట్రీ
Also Read
- Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
వచ్చే ఎన్నికల నాటికి కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువల పనులు పూర్తవుతాయని.. గత ప్రభుత్వ హయాంలో కమీషన్‌లకు కక్కుర్తి పడి కాలువల పనులు పూర్తి చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు చేశారు. కుప్పంలో సీఎం జగన్ సభ ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని.. ప్రజలందరూ ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా కుప్పంలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ కూడా పర్యవేక్షించారు. సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని వారు తెలిపారు. కాగా ఈ పర్యటనలో వైఎస్ఆర్ చేయూత మూడో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
-
Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
-
IND Vs WI 4th T20: ఉప్పల్లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!