రేపల్లె అత్యాచార ఘటన అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య అగ్గి రాజేసింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు సైతం వారి వ్యాఖ్యలకు ధీటుగా బదులిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మంత్రి మేరుగ నాగార్జున ప్రతిపక్షంపై ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు.
Read Also: Minister Gudivada Amarnath: చంద్రబాబు ఇరుక్కోవడం ఖాయం!
పేద ప్రజల కోసం సీఎం జగన్ పాటు పడుతుంటే, ప్రతిపక్షాలు వాటిలో తప్పులు వెతుకుతున్నాయని మండిపడ్డారు. రాష్టంలో జరుగుతున్న దాడులు, మహిళల అఘాయిత్యాలపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని చెప్పారు. చంద్రబాబు, నారా లోకేష్ అనవసరంగా మాట్లాడుతున్నారని.. ఎవరో చేసిన చర్యల్ని ప్రభుత్వానికి అంటగడుతున్నారని విమర్శించారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పట్టించుకునే నాథుడే ఉండేవారు కాదని, గుడ్డ కాల్చి ప్రభుత్వంపై వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు రాబందుల్లా వాలిపోతున్నారని ఆగ్రహించారు.
‘కేసులు పెట్టించుకుని రండి’ అని లోకేష్ కార్యకర్తలతో చెప్తుండడాన్ని బట్టి చూస్తుంటే.. రాష్టంలో జరుగుతున్న దాడుల్లో ఆయన పాత్ర ప్రధానంగా ఉందేమోనని అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో టీడీపీ గెలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవర్నీ బ్రతకనివ్వరని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు.