Site icon NTV Telugu

Nadendla Manohar: రేషన్ మాఫియాకు మంత్రి నాదెండ్ల మనోహర్ వార్నింగ్.. ఇక అరెస్టులే..!

Nadendla

Nadendla

Nadendla Manohar: త్వరలోనే 41 A కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారి అరెస్టులు కూడా ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇప్పటికే 6A కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కాకినాడను అడ్డాగా మార్చుకుని ఊహించని విధంగా గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు జరిగిందని వెల్లడించారు. ఒక కుటుంబం కనుసన్నల్లో పోర్ట్ నడిచిందని ఆరోపించారు. అక్రమ సరఫరా ఆగాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. చెక్ పోస్ట్ దగ్గర ఇబ్బందులు లేకుండా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అవసరం అయితే మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు.

Read Also: Rajasthan Shocker: భార్యకు ఘోరమైన శిక్ష.. బైకుకి కట్టి ఈడ్చుకెళ్లిన భర్త..

ముఖ్యమంత్రితో చర్చించి రేషన్ మాఫియాలో సీఐడీని ఇన్వాల్వ్ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి వ్యాపారం చేసుకుంటామంటే ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్ట్ నుంచి 400 ఎకరాలకు ప్రభుత్వానికి రూ. 40 కోట్లు ఆదాయం మాత్రమే వస్తుందన్నారు. చెక్ పోస్ట్‌ల ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. పోర్టు ఏ ఒక్క కుటుంబానిది కాదన్నారు. లారీలు వెయిట్ చేయకుండా మరొక చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. చెక్ పోస్ట్‌లలో మూడు షిఫ్ట్‌లలో ఉద్యోగులు ఉంటారన్నారు. కాకినాడ పోర్టును రేషన్ మాఫియాకు అడ్డాగా మార్చారని ఆగ్రహించారు. త్వరలోనే అరెస్టులు ఉంటాయని ఆయన చెప్పారు. చట్ట ప్రకారం ప్రొసెస్ జరుగుతుందని.. సీఎం, క్యాబినెట్‌లో చర్చించి రేషన్ మాఫియాలో సీఐడీ విచారణ చేస్తామన్నారు. వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పవన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ మాఫియా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోర్టులో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూడడమే మా బాధ్యత అని మంత్రి వెల్లడించారు.

Exit mobile version