Site icon NTV Telugu

Kottu Satyanarayana: పవన్‌ కల్యాణ్‌ వెనకాల ఉన్నవాళ్ల ఆలోచన ఒకటి.. ఆయనది మరోటి..!

Kottu Satyanarayana

Kottu Satyanarayana

Kottu Satyanarayana: టీడీపీతో పాటు.. జనసేన పార్టీని, ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేస్తూ వస్తోంది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అవకాశం దొరికినప్పుడల్లా.. పవన్‌పై సంచలన విమర్శలు చేస్తున్నారు.. అయితే, పవన్ కల్యాణ్‌.. చంద్రబాబు సీఎం అవ్వడం కోసం పనిచేస్తున్నాడని ఆరోపించారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. కానీ, పవన్ కల్యాణ్‌ వెనకాల వచ్చేవాళ్లు మాత్రం పవన్ సీఎం అవ్వాలనుకుంటున్నారని తెలిపారు.. మరోవైపు, వైసీపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.. మాకు ఎవరి మద్దతు అవసరం లేదు.. మా బలం మాకు సరిపోతుందన్నారు మంత్రి కొట్టు..

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

ఇక, శ్రీశైలం ధర్మకర్తల మండలి వాళ్లలో వాళ్లే రకరకాల కామెంట్లు చేస్తున్నారు.. టెండర్ అన్నది ఆన్‌లైన్‌లో సంవత్సరానికి ఒకసారి ఉంటుంది.. ఒకసారి టెండర్ ఫైనల్ అయ్యాక టెండర్ దారుడికి వర్క్ ఆర్డర్ ఇస్తాం.. చైర్మన్ చెప్పినా.. సభ్యులు చెప్పినా.. టెండర్ లో ఇచ్చిన రేట్ల ప్రకారమే టెండర్ ఆపోయినప్పుడు మధ్యలో ఎంటర్ అవ్వడం కుదరదని స్పష్టం చేశారు కొట్టు సత్యనారాయణ.. టెండర్ దారుడు టెండర్లు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం సప్లై చేస్తున్నాడా లేదనేది చూడగలం.. టెండర్ అయిపోయే ఒకనెల ముందు కొత్త టెండర్లు దారులకు అవకాశం ఇస్తామన్నారు. ఈసారి ఇప్పుడొచ్చే కంప్లైంట్స్ రాకుండా నిఘా పెడతామని వెల్లడించారు.. మరోవైపు.. రాష్ట్రంలోని ఆలయాల పడితరం స్టోర్ ఏ ఏ రేట్లకు కొంటున్నారని ఆన్‌లైన్‌లో పెడుతున్నాం నెలాఖరికి వస్తుందని తెలిపారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

Exit mobile version