Minister Kollu Ravindra: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అధికారం కోల్పోయి మతిభ్రమించి మాట్లాడుతున్నారు అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు అరాచకాలు చేసి.. ప్రజలను పీడించుకొని తిని.. ఈరోజు నీతులు చెబుతున్నారు అని పేర్కొన్నారు. త్వరలో వైసీపీ కార్యాలయానికి టూ లెట్ బోర్డు పెట్టబోతున్నారనే ఆందోళనలో వైసీపీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు.. బియ్యం కొట్టేసిన దొంగతో ప్రెస్ మీట్ పెట్టించడం సిగ్గుమాలిన చర్య అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
Read Also: Simhadri Appanna: సింహాద్రి అప్పన్న భక్తులకు తప్పిన ప్రమాదం.. ఎన్టీవీ కథనంతో రంగంలోకి అధికారులు
ఇక, దొంగలతో ప్రయాణం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద దొంగ అంటూ మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. పార్టీ కార్యకర్త సింగయ్య విజువల్స్ అంతా క్లియర్ గా ఉంటే.. మా కారుకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తున్నారు అని ఆరోపించారు. సింగయ్య మృతికి సంబంధం లేదన్నప్పుడు ఆయన భార్యను మీరు ఎందుకు ఇంటికి పిలిపించుకొని పరామర్శించే డ్రామా ఆడారు అని ప్రశ్నించారు.
