Site icon NTV Telugu

Minister Karumuri: మీడియా తప్పుడు రాతలపై కోర్టును ఆశ్రయిస్తాం

Karumuri Nageswara Rao

Karumuri Nageswara Rao

ధాన్యం కొనుగోలులో దోపిడీ అంటూ కొన్ని మీడియాలలో వచ్చిన వార్తలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని.. రైతు భరోసా కేంద్రాలపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులు కాని వారిని రైతులుగా చూపిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు రాతలతో విషప్రచారం చేస్తున్నాయని.. ఇలాంటి వార్తలపై తాము కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

YSR Sanchara Pashu Arogya Seva: అంబులెన్స్ సేవలు ప్రారంభించిన జగన్

అటు రాజ్యసభ ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌ చెప్పిన మాటలను కూడా కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ కేవైసీ త్వరగా చేయకపోవడం వల్ల తప్పులు జరిగే అవకాశాలున్నాయని మాత్రమే ఎంపీ సుభాష్‌ చంద్రబోస్ చెప్పినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 68 వేల మంది రైతులు ఉంటే 51 వేల మంది ఈ కేవైసీ నమోదు చేసుకున్నారని.. ఇంకా 17వేల మంది రైతులు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ-కేవైసీ నమోదు ద్వారా అక్రమాలకు ఆస్కారం ఉండదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. మిల్లర్లు, అధికారులు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Exit mobile version