దమ్ముంటే రైతుల కోసం ఏం చేశారో చెప్పాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దిగుబడి, వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంట నష్టపోతే రైతులకు కూడా నష్టపరిహారం ఇస్తున్నాం, రైతులకు మేలు జరుగుతుంటే కొందరు తట్టుకోలేక పోతున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో ఎప్పుడైనా ఇంత పరిహారం ఇచ్చారా..? అని ప్రశ్నించిన ఆయన.. దమ్ముంటే వివరాలు చెప్పండి అని చాలెంజ్ విసిరారు. చంద్రబాబు హయాంలో బీమా ఇవ్వకుండా ఎగ్గొట్టి పోయారని ఎద్దేవా చేసిన కాకాణి.. రైతులు బాగుంటే చంద్రబాబు తట్టుకోలేరు.. చంద్రబాబుకు దమ్ము ఉంటే రైతుల కోసం ఏమి చేశారో చెప్పాలని సవాల్ చేశారు.
Read Also: SBI: గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. వాటిపై వడ్డీ రేట్లు పెంపు..
దోపిడీ పథకాలు తప్ప ఉపయోగపడేదేమీ చేయలేదని చంద్రబాబుపై మండిపడ్డారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. రుణ మాఫీ పేరుతో మోసం చేశారు.. రైతులకు అన్ని రకాల బకాయిలు పెట్టారని.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని అందించారిన గుర్తుచేశారు. అన్ని పథకాలను పారదర్శకంగా ఇస్తున్నాం.. కానీ, సీఎం జగన్‌కు.. నారా లోకేష్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం గురించి లోకేష్ కు ఏమి తెలుసు? అని ప్రశ్నించారు.. ఆరి పోతున్న టీడీపీ దీపాన్ని చేతులు అడ్డుపెట్టి కాపాడేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.