NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: నల్లపురెడ్డితో మంత్రి కాకాణి భేటీ.. విషయం ఇదే..!

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ 2లో మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతలు చాలా మందే ఉన్నారు.. తమ మంత్రి పదవి ఊడిపోవడంతో సిట్టింగులు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. తొలిసారి పదవి రాలేదు.. మలి కేబినెట్‌లోనైనా అవకాశం వస్తుందని ఎదురుచూసినవారిలో కూడా కొంతమందికి మొండి చేయి చూపడంతో అసంతృప్తిగా ఉన్నారు.. ఇప్పటికే చాలా మందిని బుజ్జగించారు వైసీపీ నేతలు.. అయితే, ఇవాళ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి… మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ప్రసన్న కుమార్‌రెడ్డిని కలిసిన ఆయన.. పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఇక, మంత్రి పదవి దక్కించుకున్న తర్వాత తొలిసారి నెల్లూరుకు వచ్చిన కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికాయి వైసీపీ శ్రేణులు.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో.. ఆయనతో సమావేశమై చర్చించారు కాకాణి. కాగా, కేబినెట్‌ విస్తరణ తర్వాత నెల్లూరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో హీట్‌ పుట్టిన విషయం తెలిసిందే.. పోటీపోటీ సభలు, కార్యక్రమాలు చర్చగా మారాయి.

Read Also: Kodali Nani: మంత్రి పదవి వెంట్రుక ముక్కతో సమానం.. ఎమ్మెల్యేగా ఉండటమే ఇష్టం

Show comments