మూడు రాజధానులు… రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు.. దీంతో చంద్రబాబు పని ఐపోయింది.. అమరావతి విషయంలో భూ భాగోతం బయట పడిందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి… నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసనసభ జరగకుండా తెలుగుదేశం పార్టీ సభ్యులు అవరోధాలు కల్పిస్తున్నారంటూ మండిపడ్డారు.. ఎన్ని రోజులు పెట్టినా టీడీపీ లక్ష్యం సమావేశాలను అడ్డుకోవడమే.. దీంతో, ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. ఇక, ప్రభుత్వం రాజధానిని నిర్ణయించకముందే టీడీపీ నేతలు భూములు ఎలా కొన్నారు..? అని ప్రశ్నించారు కాకాణి.. దీంతో, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనిఅందరికీ అర్థమైందన్నారు.. మరోవైపు.. అమరావతి రైతుల పాదయాత్రలో నారా హమారా… అమరావతి హమారా అని చెప్పి.. వాళ్లే ఇది చంద్రబాబు యాత్ర అని చెప్పకనే చెప్పారని వ్యాఖ్యానించారు..
Read Also: Aadhaar : ఆధార్ అప్‌డేట్ చేయాల్సిందే..!
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ టీడీపీకి ఇష్టంలేదని ఆరోపించారు మంత్రి కాకాణి.. అందుకే చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారని.. ఇప్పుడు వైఎస్ జగన్ వికేంద్రీకరణ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు.. ఇక, టీడీపీ నేతలు ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారు… రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని.. అప్పట్లో టీడీపీ నేతలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు ఇచ్చారు.. ఇప్పుడు అర్హత ఉంటే అందరికీ పథకాలను సీఎం జగన్ అందిస్తున్నారని తెలిపారు. నీరు చెట్టు పేరుతో కోట్లు దోచుకున్నారని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు అధికారంలో ఉంటే నీళ్లే ఉండవు అని ఎద్దేవా చేశారు.. కేవలం టీడీపీ నేతల కోసమే పథకాలు పెట్టి కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని ఫైర్ అయిన ఆయన.. దీంతో.. ఉమ్మడి కుటుంబాలు కూడా విడిపోయాయన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు రాజకీయ జీవితానికి ప్రజలు సమాధి కడతారని జోస్యం చెప్పారు.. కోవిడ్ సమయంలో కూడా సంక్షేమ పథకాలను జగన్ అమలు చేశారని ప్రశంసించారు.. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారో ప్రజల్లోకి వచ్చి చూడాలని హితవుపలికారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.