Kakani Govardhan Reddy: తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ ఆగడాలు మితిమీరుతున్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాల వల్ల పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈ అంశంపై స్పందించారు. లోన్ యాప్ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని.. వీటిపై వెంటనే స్పందించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. లోన్ యాప్ నిర్వాహకుల గ్యాంగ్‌ను పోలీసులు వలపన్ని పట్టుకున్నారని తెలిపారు. ఆ గ్యాంగ్ చెన్నై నుండి ఆపరేట్ చేస్తున్నారని.. తెలుగు తెలిసిన వారి ద్వారా అక్కడి నుండి ఆపరేట్ చేస్తున్నారన్నారు. ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారిని కూడా తీసుకువచ్చామన్నారు. లోన్ యాప్‌ల ఆగడాలపై దృష్టిపెట్టామని.. ఇది ఆరంభం మాత్రమే అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Read Also: Singireddy Niranjan Reddy : 8 ఏళ్లల్లో కేసీఆర్ ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు
కాగా ఆన్ లైన్ యాప్ ద్వారా ఎవరైనా ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి సూచించారు. ఫోన్ కాల్ వస్తే కాల్ మనీ కేసుగా వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆన్ లైన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మార్ఫింగ్, ఫేస్ బుక్‌లో పెట్టే పరిస్ధితి తగ్గిందన్నారు. ఆన్‌లైన్ యాప్‌లు త్వరలోనే నిర్వీర్యం అయిపోతాయని మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.