Site icon NTV Telugu

Jogi Ramesh: సంక్రాంతి ప్యాకేజ్ కోసమే.. చంద్రబాబు, పవన్ భేటీపై జోగి రమేశ్ కౌంటర్స్

Jogi Ramesh Counters

Jogi Ramesh Counters

Minister Jogi Ramesh Satires On Chandrababu Naidu Pawan Kalyan Meeting: పవన్ కల్యాణ్, చంద్రబాబు తాజా భేటీపై మంత్రి జోగి రమేశ్ కౌంటర్ల వర్షం కురిపించారు. తానిప్పుడే కొన్ని టీవీ ఛానెళ్లలో ‘పవర్‌ఫుల్’ మీట్ అనే కొటేషన్‌తో వార్తలు చూశానని.. అది పవర్‌ఫుల్ మీట్ కాదు, పవర్‌ఫుల్ ప్యాకేజ్ అని సెటైర్ వేశారు. సంక్రాంతి ప్యాకేజ్ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడన్నారు. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా కందుకూరులో, గుంటూరులో చనిపోయిన వారిని పరామర్శిస్తారని.. చంద్రబాబు ఇంటికి పరామర్శించడానికి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. అభం శుభం తెలియని అమాయకులు చనిపోతే.. ఏ రాజకీయ నాయకుడైనా సరే వారిని పరామర్శించి, ‘నేనున్నాను’ అని ఆ కుటుంబానికి ధైర్యం చెప్తారన్నారు. కానీ.. పవన్ కళ్యాణ్ అలా కాకుండా కుప్పంలో డ్రామాలాడిన చంద్రబాబుని కలిసేందుకు హైదరాబాద్‌లో ఆయన ఇంటికి వెళ్లాడన్నారు. అసలు చంద్రబాబుకి ఏం జరిగిందని పరామర్శించడానికి పవన్ వెళ్లాడు? అని నిలదీశారు.

Gudivada Amarnath: పవన్, చంద్రబాబు భేటీపై సెటైర్.. సంక్రాంతి మామూళ్ల కోసమట!

ఇంకా చంద్రబాబే సభలతో పోలీస్ వ్యవస్థ మీద దాడులు చేయించాడని జోగి రమేశ్ ఆరోపణలు చేశారు. తనకు అసలు ఎదురే లేదన్నట్టుగా.. రోడ్ల వెంట చంద్రబాబు తిరిగారని ఆగ్రహించారు. ‘‘నాకు ఎంత ప్యాకేజ్ ఇస్తావ్, ఎన్ని సీట్లు ఇస్తావ్, నేనెక్కడ అమ్ముడుపోవాలి?’’ అనే విషయాలు మాట్లాడటం కోసమే.. దత్తతండ్రి ఇంటికి దత్తపుత్రుడు వెళ్లాడని వ్యాఖ్యానించారు. బయట మాత్రం జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తారని, లోపల మాత్రం ప్యాకేజ్ వ్యవహారాలే నడుస్తాయని, ఈ విషయాలు తమకు బాగా తెలుసని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని.. కానీ ఈ ప్రభుత్వాన్ని ఎలా అస్థిరపరచాలన్న దురుద్దేశంతో కుట్రలు పన్నుతున్నారన్నారు. అయితే.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ప్రజలు ఎన్నుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ని ఒక అంగుళం కూడా కదల్చలేరన్నారు. ఒక పార్టీకి లీడర్ అయిన పవన్ కల్యాణ్.. కందుకూరులో ఎనిమిది మంది, గుంటూరులో ముగ్గురు చనిపోతే ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

School Principal Offer: విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపాల్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?

పవన్, చంద్రబాబులకు ప్రజా సమస్యలేమీ పట్టలేదని.. కేవలం దోచుకోవడం మీదే దృష్టంతా అని జోగి రమేశ్ పేర్కొన్నారు. 2014 నుంచి 2019 దాకా వాళ్లిద్దరు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి, పవన్ కల్యాణ్‌లకు ఓటమి తప్పదని.. ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని థీమా వ్యక్తం చేశారు. మీరిద్దరు కలిసొచ్చినా.. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రజలు తీర్పు ఇస్తారని నమ్మకం వెలిబుచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కి 175 సీట్లు గెలిచి.. విజయ దుందుభి మోగిస్తుందని జోస్యం చెప్పారు.

Exit mobile version