Jogi Ramesh: గుడివాడ గడ్డ కొడాలి అడ్డా.. ఈక కూడా పీకలేరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా.. అందరూ కలిసొచ్చినా ఈక కూడా పీకలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేష్.. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుడివాడ గడ్డ కొడాలి అడ్డా.. దీనిని ఎవరూ చెక్కు చెదర్చలేరు అన్నారు.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కార్యకర్తల కష్టం, పోరాట ఫలితంగానే రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మూడేళ్ల పాలనలో మనం సాధించిన విజయాలను మళ్లీ గడపగడపకు వెళ్లి వివరిస్తున్నామని తెలిపారు.. ఇన్ని పథకాలు అందిస్తున్నామని ధైర్యంగా చెప్పే దమ్ము ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకే ఉందన్నారు. ఇక, మరో 25 ఏళ్లు ఆంధ్ర రాష్ట్రానికే జగనే సీఎం అని స్పష్టం చేశారు.
Read Also: Kodali Nani: ఎన్టీఆర్ ప్రజా నాయకుడు.. ఆయన విగ్రహానికి ఎలాంటి రంగులైనా వేసుకోవచ్చు
Also Read
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
మరోవైపు, చంద్రబాబు గుడివాడ పర్యటనపై స్పందిచిన జోగి రమేష్.. చంద్రబాబు.. గుడివాడకు వచ్చి ఏం చెప్తారు? అని నిలదీశారు.. కొడాలి నాని ఓడిస్తానని చెబుతాడా… ఇది జరిగే పనేనా ?? అంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్… ఇంకా ఎంత మంది కలిసినా కొడాలి నానిని ఏం చేయలేరు.. అందరూ కలిసొచ్చినా ఈక కూడా పీకలేరు.. నానిని ఓడించే సత్తా మీకు లేదంటూ సవాల్ చేశారు. ఇక, ఎన్టీఆర్‌ను పొట్టన పెట్టుకుని ఇప్పుడెలా నిమ్మకూరు వస్తావు చంద్రబాబు? అంటూ ఫైర్ అయ్యారు. నిమ్మకూరులో చంద్రబాబు బస చేస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. అసలు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.. దమ్ముంటే సామాజిక న్యాయంపై చర్చకు మేం సిద్ధం… చర్చకు వచ్చే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ చాలెంజ్ చేశారు.. 25 మంది మంత్రుల్లో 17 మంత్రి పదవులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇచ్చిన చరిత్ర వైఎస్ జగన్‌ది అన్నారు.. జగన్ ఓ ధీశాలి, ఓ ధీరుడు అంటూ అభివర్ణించారు మంత్రి జోగి రమేష్.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!