Site icon NTV Telugu

Gudivada Amarnath: పవన్‌కు మంత్రి ఆఫర్‌.. ‘సీఎం పవన్ కళ్యాణ్’ పేరుతో సినిమా తీస్తే నేనే ప్రొడక్షన్ చేస్తా..

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాత్‌.. అనకాపల్లిజిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన ఫ్యాన్స్ కలలు కంటున్నారు.. అయితే, ‘సీఎం పవన్ కళ్యాణ్’ పేరుతో సినిమా తీస్తే నేనే ప్రొడక్షన్ చేస్తానన్నారు.. అంటే, పవన్‌ కల్యాణ్‌ను తెరపై సీఎంగా చూసుకోవచ్చు.. నిజ జీవితంలో ఆయన సీఎం కాలేరనే తరహాలో ఎద్దేవా చేశారు.. ఇక, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియని వాడు పవన్ కళ్యాణ్.. అలాంటి వ్యక్తి సీఎం అవుతారా? అని ప్రశ్నించారు.. ఆయన సినిమాల్లో పవర్ స్టార్‌.. కానీ, పాలిటిక్స్ లో ప్యాకేజ్ స్టార్ అంటూ మరోసారి విరుచుకుపడ్డారు..

Read Also: KA Paul: చంద్రబాబు కంటే జగన్ వేయి రెట్లు బెటర్.. నా సలహాలు పాటించారు

ఇక, 2024ఎన్నికల్లో టీడీపీకి మహాప్రస్థానం ఖాయం అని జోస్యం చెప్పారు మంత్రి అమర్నాథ్‌.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన ఏ పథకం అయినా.. వ్యవస్థనైనా తీసేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. మూడేళ్ళలో నా మీద ఒక్క అవినీతి మచ్చ కూడా లేదు.. ఉంటే నిరూపించండి అంటూ సవాల్‌ చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల భుకబ్జాలను అడ్డుకున్నాం.. సెంటు కాదు కదా సెంటీమీటర్ భూమి కూడా మీరు ఆక్రమించ లేరని ప్రకటించారు. సహకార చక్కెర కర్మాగారాలు నాశనం చేసింది చంద్రబాబే అని ఆరోపించారు.. చెరకు పంట లభ్యత లేనందునే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరవలేకపోతున్నాం అని వివరించారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.. ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని చంద్రబాబు అణిచివేసినప్పుడు పవన్‌ ఎక్కడ దాక్కున్నారు? అని నిలదీశారు.. ముద్రగడను చంద్రబాబు ప్రభుత్వం వేధించినప్పుడు పవన్‌ ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.. హరి రామజోగయ్య దీక్షచేస్తేనే పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.. టీడీపీ ప్రభుత్వంలో మాట్లాడని పవన్‌.. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు.. పవన్‌ ఇప్పుడే మాట్లాడటం వెనుకున్న ఉద్దేశం ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు అంబటి రాంబాబు.

Exit mobile version