టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. బిర్లా-సీఎం వైఎస్ జగన్ ఇద్దరూ లంచ్ మీటింగ్ పెట్టుకున్నారని తెలిస్తే చంద్రబాబుకి గుండె అగిపొద్దేమో అని సెటైర్లు వేశారు.. ఆదిత్యా గ్రూప్ కంపెనీ రాష్ట్రానికి రావడం శుభపరిణామంగా అభివర్ణించిన ఆయన.. రూ. 2500 కోట్ల పెట్టుబడులతో 2500 మందికి ఉపాధి రాబోతుందన్నారు.. కానీ, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే చంద్రబాబుకి కడుపు మండుతుందని.. చంద్రబాబు కడుపు మంట ఆయన మాటల్లో కనిపిస్తుందని.. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, అభివృద్ధి జరగడం చంద్రబాబుకి ఇష్టం లేదని మండిపడ్డారు.
Read Also: RK Roja: నన్ను సినిమాల్లోకి, రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఆయనే-రోజా
ఇక, కాలుష్యం రాకుండా జాగ్రత్తలు తీసుకునే విషయంలో ప్రభుత్వ నిబంధనలకు యాజమాన్యం అంగీకరించినట్టు తెలిపారు మంత్రి అమర్‌నాథ్.. జీరో శాతం డిశ్చార్జ్ తో పరిశ్రమ నడుపుతామని హామీ ఇచ్చారని.. సీఎం జగన్ తీసుకువచ్చిన స్థానికులకు 75 శాతం చట్టం ప్రకారం ఉపాధి ఇస్తామని అంగీకరించినట్టు వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరింతగా పరిశ్రమలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మరోవైపు.. పుట్టినరోజు నాడు కూడా చంద్రబాబు నీచ రాజకీయాలు మానలేదు.. చంద్రబాబుకి సొంత పుత్రుడుపై నమ్మకం లేక దత్తపుత్రుడిని నమ్మకున్నాడని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్.
