Minister Gottipati: విపత్తు పరిశీలన అంటే రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన మాజీ సీఎం జగన్ కు తుఫాన్లు గురించి మాట్లాడే అర్హత లేదు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తుఫాను వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగక పోవడంతో ఆయనకు బాదాగా ఉందేమోనని ఎద్దేవా చేశారు. మొంథా తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా సీఎం సూచనల మేరకు విద్యుత్ శాఖ రెండు రోజుల ముందే అప్రమత్తమై సిబ్బందిని మోహరించింది అన్నారు. ఏ ఒక్కరికీ ప్రాణ నష్టం జరగకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేసింది అని మంత్రి గొట్టిపాటి రవి చెప్పుకొచ్చారు.
Read Also: Kantara Chapter 1 : ఇంత తొందరగా “కాంతార చాప్టర్ 1” ఓటీటీ రిలీజ్‌కి.. ఆ ఒప్పందమే కారణామ..?
ఇక, దాదాపు 1500 మంది సిబ్బందిని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాలకు మోహరించాం అని మంత్రి రవి కుమార్ పేర్కొన్నారు. నష్టం జరిగిన 24 గంటల్లోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించాం.. దాదాపు 13 వేల విద్యుత్ స్తంభాలు, 3 వేల కిలోమీటర్లు మేర కండక్టర్, 3 వేల ట్రాన్స్‌ఫార్మర్ల వరకూ దెబ్బతిన్నాయని తెలిపారు. వ్యవసాయ, ఆక్వా రంగానికి సంబంధించి వాలిపోయిన విద్యుత్ స్తంభాలు వంటివి మరో 48 గంటల్లో పునరుద్దరిస్తాం.. కొన్ని చోట్ల గాలుల వేగం ఎక్కువగా ఉన్నందునే పవర్ షట్ డౌన్ చేశామన్నారు. విద్యుత్ సిబ్బంది కూడా ప్రాణాలు ఫణంగా పెట్టి నిర్విరామంగా పని చేశారు.. ప్రతీ ఒక్క విద్యుత్ సిబ్బందికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలువుతున్నామని మంత్రి గొట్టిపాటి రవి వెల్లడించారు.
