ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు, ప్రజల తరుపున ఎవరు నిలబడ్డారో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. మూడు రాజధానులపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోన్న సమయంలో.. ఓవైపు మూడు రాజధానులు.. మరోవైపు అమరావతి రాజధాని డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసి ప్రయాణం సుఖం , సురక్షితం అన్నారు.. ఆర్టీసీ బస్సులను వాడుకొనపొవడమే ప్రమాదాలకు కారణం అన్నాఉ.. ఒక్కో ఆటోలో పది, 12 మంది ప్రయాణిస్తున్నారు.. ఈ విషయం ప్రజల మైండ్ సెట్ మారాలని సూచించారు.. శ్రీకాకుళం ప్రజల అవసరం కోసం 24 బస్సులు అదనంగా ప్రారంభిస్తున్నాం.. ఆర్టీసీ ఉద్యోగులు సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.. 1980లో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మించాం.. దాంతో, నీరు నిలిచిపోతోంది.. దీనికి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.
Read Also: Munugode Bypoll : మునుగోడులో బీజేపీ సభ రద్దు.. ప్లాన్ మారింది..
ఇక, పేదలకు భుముల కేటాయింపులో మా ప్రభుత్వానికి ఒక పాలసీ ఉందన్నారు మంత్రి ధర్మాన.. ఇళ్ల స్థలం లేని కుటుంబం ఉండకూడదని మా ప్రభుత్వం భావిస్తుందని స్పష్టం చేశారు.. ఇల్లులేని ప్రతివారికీ ఇళ్ల స్థలం కేటాయిస్తున్నాం.. 12000 వేల కోట్ల రూపాయాల డబ్బు పెట్టి భుమి కొని ప్రజలకు ఇచ్చామని వెల్లడించారు.. గతంలో ఒక్క ఎకరా కూడా చంద్రబాబు బీదల కోసం కొన్నిది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అది చంద్రబాబుకు అసహ్యమైన పని అన్నారు.. రాజధాని భూమి ప్రజలకు ఇవ్వకూడదా? రియల్ ఎస్టేట్ చెస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు.. రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమి అవసరం లేదని శివరామ కృష్ణకమిటీ చెప్పిందని గుర్తుచేసిన ఆయన.. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు, ప్రజల తరుపున ఎవరు నిలబడ్డారో ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.