ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనకు ప్రతిరూపం నిన్నటి విశాఖ గర్జన. జోరున వర్షం కురుస్తోన్నా.. ప్రజలు గర్జనలో పాల్గొన్నారు. విశాఖకు రాజధాని వద్దని గొంతులెత్తుతున్న వారికి ఓ కనువిప్పు నిన్నటి గర్జన అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖకు రాజధాని వద్దనే వాళ్లు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. టీడీపీ, జనసేన పార్టీలు కూడా తమ వైఖరిని మార్చుకోవాల్సిందే. ఇప్పటికీ టీడీపీ, జనసేనలకు ఇంకా కనువిప్పు కలగలేదు. విశాఖ మీద.. ఉత్తరాంధ్ర మీద ఎందుకంత ద్వేషం. రాజధానికి విశాఖ దొహదపడుతుందని తెలిసి కూడా విషం కక్కుతున్నారు.
ప్రతిపక్ష పార్టీల ఆకాంక్షలు నెరవు.. విశాఖకు రాజధాని వచ్చి తీరడం ఖాయం.విశాఖలో ఇంటింటికెళ్లి బ్యాలెట్ పెడితే ప్రతిపక్షాలకు విశాఖ ప్రజల అభిప్రాయం తెలుస్తుంది.విశాఖ గర్జన జరుగుతోంటే.. రాజధాని వద్దని టీడీపీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టింది.ఈ ప్రాంతానికి టీడీపీ అవసరమా..?ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలను ప్రజలు చొక్కా పట్టుకుని అడగాలి.అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తిననివ్వదన్నట్టుగా ఉంది.జనసేనకు ఓ విధానం ఉందా..?జనసేన అసలు రాజకీయ పార్టీనేనా..?జనసేనకు రాజకీయ పార్టీ లక్షణమే లేదు.
Read Also: Minister Amarnath: పవన్ ఓ పొలిటికల్ టెర్రరిస్ట్
విశాఖకు రాజధాని వద్దని పవన్ ఎందుకొద్దంటున్నారు..?గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పలేదా..?ఎయిర్ పోర్టులో సంఘటనను చంద్రబాబు తప్పు పట్టడం పోయి.. పోలీసులను తప్పు పడతారా..?ఏ చిన్న సంఘటన జరిగినా చంద్రబాబు లేఖలు రాస్తున్నారు కదా..? మంత్రులపై దాడిని ఎందుకు తప్పు పట్టరు..?జనసేన రాజకీయ పార్టీ కాదు.జనసేన ఓ సెలబ్రిటీకి చెందిన పార్టీ.ఎయిర్ పోర్టు ఘటనలో పోలీసుల వైఫల్యం.. నిర్లక్ష్యం కూడా ఉంది.విశాఖకు రాజధాని కావాలని అంతా కోరుకుంటుంటే.. ఏ ముఖం పెట్టుకుని అమరావతే రాజధాని అని ఎలా అంటారు..?
రాజధాని అంటే ఎయిర్ కనెక్టివిటీ.. సీ కనెక్టివిటీ ఉండాలి.. రైల్ కనెక్టివిటీ ఉండాలి.అమరావతికి ఏ కనెక్టివిటీ ఉంది.విశాఖకు కొద్దిపాటి ఖర్చు పెడితే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది.చంద్రబాబు చెప్పిన సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటలుగా మారుతుంది.నిధులన్నీ అమరావతికే పెట్టాలా..? మేం అక్కడ కూలీలుగానే ఉండాలా..? అమరావతి కోసం పాదయాత్ర చేస్తోంది రైతులు కాదు. నారా హమారా అని రాజధాని రైతులు అంటున్నారు. మేమూ అదే చెబుతున్నాం. రాజధాని రైతులు ఏదో త్యాగం చేశారట. వాళ్ల సంపదని పెంచుకోవడానికి చేసిన పనులను త్యాగం అంటారా..? రాజధాని రైతులకే రాజ్యాంగం ఉందా..? ఉత్తరాంధ్ర ప్రజలు థర్డ్ క్లాస్ సిటిజన్సుగానే ఉండాలా..? మా ప్రాంతానికి వచ్చి.. మా ప్రాంతం వాళ్లనే తిడితే మేం చూస్తూ ఊరుకోవాలా..? వీలైనంత త్వరగా సీఎం జగన్ విశాఖ నుంచి పాలన చేయాలని కోరుతున్నాం అన్నా మంత్రి బొత్స.
నేనేమన్నా సినిమా వాడినా..? ఎవరో ఏదో చెబితే చేయడానికి..?నేను ప్రజాస్వామ్యబద్దంగా ఎదిగాను.జనవాణిని మేమేందుకు అడ్డుకుంటాం.విశాఖలో అక్రమాలు జరిగాయంటున్నప్పుడు గత ఐదేళ్లల్లో అప్పటి ప్రభుత్వం ఏం చేసింది..?విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై మేమే ముందుగా స్పందించాం.అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు వికేంద్రీకరణ బిల్లు పెడతాం.టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విశాఖకు అన్యాయం చేయొద్దని నాటి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు అడగలేదు..?
అప్పుడు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అడగలేదు.. మేం ఇప్పుడు మా నాయకుడు జగన్ను అడిగాం.మమ్మల్ని విడాకులు తీసుకోమంటారా..?హిందూ సంప్రదాయం ఏంటీ..? పవన్ కామెంట్లేంటీ..? మా ప్రాంత ప్రజలు కడుపుమండే గర్జన చేశాం.. ప్రజలు పాల్గొన్నారు.టీడీపీ ఏదో జేఏసీని జగన్ యాక్షన్ కమిటీ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.వాళ్లు పెట్టిన కమిటీలన్నీ కమిటీలా..?జేఏసీ పెట్టిన తర్వాతే.. విశాఖలో భూ అక్రమాలు గుర్తొచ్చాయా..?
Read Also:Somu Veerraju: కండ కావరం, అధికార దాహంతో ర్యాలీలు చేస్తారా?