Site icon NTV Telugu

26 జిల్లాలు ఎలా వస్తున్నాయో.. మూడు రాజధానులు అలాగే వస్తాయి: మంత్రి అవంతి

మూడు రాజధానుల అంశంపై మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్తగా 26 జిల్లాలు ఎలా వస్తున్నాయో.. అదే తరహాలో మూడు రాజధానులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాల విభజన వల్ల కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాల విభజన చారిత్రాత్మకం, అభివృద్ధి దాయకం అని ఆయన తెలిపారు.

Read Also: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దరఖాస్తు గడువు మరోసారి పెంపు

తెలంగాణలో జిల్లాలను విజయవంతంగా విభజించి అధికార వికేంద్రీకరణ చేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ గుర్తు చేశారు. ఒక్క చంద్రబాబు తప్ప అన్ని పార్టీలు జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. ఏపీలో ఉద్యోగుల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని తెలిపారు, ఉద్యోగులు తమ ఇంటి సభ్యులు లాంటివారని, చర్చల ద్వారా పీఆర్సీ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు.

Exit mobile version